Breaking News

T20 WC 2024 IND VS PAK: క్రికెట్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌

Published on Sun, 06/09/2024 - 17:56

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఇవాళ (జూన్‌ 9) మహాసంగ్రామం జరగాల్సి ఉంది. న్యూయార్క్‌ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌ కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు యావత్‌ క్రికెట్‌ ప్రపంచం మొత్తం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. అయితే ఈ బిగ్‌ ఫైట్‌కు ముందు వరుణ దేవుడు క్రికెట్‌ అభిమానులను కలవరపెడుతున్నాడు.

మ్యాచ్‌ ప్రారంభ సమయానికి (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలు) వర్షం పడే సూచనలు ఉన్నట్లు న్యూయార్క్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షం కారణంగా టాస్‌ కూడా నిర్ణీత సమయంలో పడకపోవచ్చని అంచనా. అయితే సమయం గడిచే కొద్ది వరుణుడు శాంతించవచ్చని సమాచారం. ఒకవేళ వరుణుడు మ్యాచ్‌ ప్రారంభానికి ఆటంకం కలిగించినా ఓవర్ల కుదింపుతో మ్యాచ్‌ సాధ్యపడే అవకాశం ఉంది.

మ్యాచ్‌ ప్రారంభానికి రెండున్నర గంటల ముందు అక్కడి వాతావరణం మేఘావృతమై ఉంది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే భారత్‌, పాక్‌లకు చెరో పాయింట్ లభిస్తుంది.

మరోపక్క ఈ మ్యాచ్‌కు కేటాయించబడిన పిచ్‌ ఆటగాళ్లను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ డ్రాప్‌ ఇన్‌ వికెట్‌ క్యూరేటర్లకు సైతం అంతుచిక్కని విధంగా ఉంది. అనూహ్య బౌన్స్ కార‌ణంగా బ్యాట‌ర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాటర్ల పాలిట ఈ పిచ్‌ సింహస్వప్నంలా మారింది. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు సార్లు మాత్రమే 100కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్దమవుతుంది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)