Breaking News

T20 World Cup 2024: గిల్‌క్రిస్ట్‌ను అధిగమించిన డికాక్‌

Published on Thu, 06/20/2024 - 18:21

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా యూఎస్‌ఏతో నిన్న (జూన్‌ 19) జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్ మెరుపు అర్దశతకంతో (40 బంతుల్లో 74; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడిన విషయం తెలిసిందే. 

ఈ హాఫ్‌ సెంచరీతో డికాక్‌ ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో అతను దిగ్గజ వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ను అధిగమించాడు. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్ల జాబితాలో శ్రీలంక ఆల్‌టైమ్‌ గ్రేట్‌ కుమార సంగక్కర అగ్రస్థానంలో ఉన్నాడు.

ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్లు వీరే..

కుమార సంగక్కర (84 ఇన్నింగ్స్‌ల్లో 2855 పరుగులు)
క్వింటన్‌ డికాక్‌ (53 ఇన్నింగ్స్‌ల్లో 1685 పరుగులు)
ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (50 ఇన్నింగ్స్‌ల్లో 1636 పరుగులు)
జోస్‌ బట్లర్‌ (56 ఇన్నింగ్స్‌ల్లో 1550 పరుగులు)
ముష్ఫికర్‌ రహీం (61 ఇన్నింగ్స్‌ల్లో 1500 పరుగులు)

కాగా, యూఎస్‌ఏతో నిన్న జరిగిన తొలి సూపర్‌-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. డికాక్‌ (74), మార్క్రమ్‌ (46), క్లాసెన్‌ (36 నాటౌట్‌), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (20 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.

అనంతరం 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో​కి దిగిన యూఎస్‌ఏ.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్‌ ఆండ్రియస్‌ గౌస్‌ (80 నాటౌట్‌), హర్మీత్‌ సింగ్‌ (38) యూఎస్‌ఏను గెలిపించేందుకు విపలయత్నం చేశారు. సౌతాప్రికా బౌలర్లలో కగిసో రబాడ (4-0-18-3) అద్భుతంగా బౌలింగ్‌ చేసి యూఎస్‌ఏను కట్టడి చేశాడు.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?