Breaking News

T20 WC 2024 IND VS PAK: రోహిత్‌ శర్మ సూపర్‌ సిక్సర్‌.. వైరల్‌ వీడియో

Published on Sun, 06/09/2024 - 21:52

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా న్యూయార్క్‌ వేదికగా భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఇవాళ (జూన్‌ 9) జరుగుతున్న హై ఓల్టేజీ మ్యాచ్‌కు వరుణుడు క్రమం తప్పకుండా ఆటంకం కలిగిస్తూ వస్తున్నాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందే వర్షం మొదలవడంతో టాస్‌ అర్ద గంట ఆలస్యంగా పడింది. టాస్‌ అనంతరం మరో మారు జల్లులు కురువడంతో మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌ రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కాగా వరుణుడు మరోసారి పలకరించాడు. 

వరుణుడు ఆటంకాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. పాక్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా షాహీన్‌ అఫ్రిది వేసిన తొలి ఓవర్‌లో 8 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్‌లో రోహిత్‌ అద్భుతమైన సిక్సర్‌ బాది భారత ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. అఫ్రిది వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికే రోహిత్‌ లెగ్‌ సైడ్‌ దిశగా తన ట్రేడ్‌ మార్క్‌ సిక్సర్‌ బాదాడు. రోహిత్‌ సిక్సర్‌ బాదిన విధానం చూసి అఫ్రిది నవ్వుకుంటూ ఉండిపోయాడు. హిట్‌మ్యాన్‌ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

తొలి ఓవర్‌ ముగియగానే మరోసారి వర్షం పలకరించడంతో మ్యాచ్‌కు బ్రేక్‌ పడింది. తొలి ఓవర్‌ తర్వాత టీమిండియా స్కోర్‌ 8/0గా ఉంది. రోహిత్‌ 8, విరాట్‌ 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

కాగా, ఈ మ్యాచ్‌లో భారత్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించగా.. పాక్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఓ మార్పు చేసింది. పాక్‌.. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఆజం ఖాన్‌కు పక్కన పెట్టి ఇమాద్‌ వసీంను తుది జట్టులోకి తీసుకుంది.

తుది జట్లు..

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్

పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్‌), బాబర్ ఆజం(కెప్టెన్‌), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)