Breaking News

టీ20 వరల్డ్‌కప్‌ 2024 తొలి సెమీఫైనల్‌.. ఏ జట్టు గెలిచినా రికార్డే..!

Published on Wed, 06/26/2024 - 15:39

టీ20 వరల్డ్‌కప్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ సారి ఫైనల్‌కు క్వాలిఫై అయ్యే మొదటి జట్టుకు ప్రపంచకప్‌ టోర్నీల్లో ఇది మొదటి ఫైనల్‌ అవుతుంది. భారతకాలమానం ప్రకారం రేపు (జూన్‌ 27) ఉదయం జరుగుబోయే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు ఫైనల్‌కు చేరినా రికార్డే అవుతుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ప్రపంచకప్‌ టోర్నీల్లో (వన్డే, టీ20) ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. సౌతాఫ్రికా పలు మార్లు సెమీఫైనల్‌కు చేరగా.. ఆఫ్ఘనిస్తాన్‌కు మాత్రం ఇదే తొలి సెమీఫైనల్‌.

కాగా, ట్రినిడాడ్‌ వేదికగా సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య రేపు ఉదయం తొలి సెమీఫైనల్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్‌ 29 జరిగే ఫైనల్‌ మ్యాచ్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు రెండో సెమీఫైనల్లో భారత్‌- ఇంగ్లండ్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ రేపు రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. 

మ్యాచ్‌ జరిగే సమయానికి 88 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే.. సూపర్‌-8లో గ్రూప్‌ టాపర్‌గా ఉన్నందున్న టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే కూడా లేదు. మరోవైపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య జరిగే తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్‌ డే ఉంది. ఒకవేళ రేపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా సాధ్యపడకపోయినా రిజర్వ్‌ డే అయిన 28న తేదీన మ్యాచ్‌ను జరిపిస్తారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)