Breaking News

నేడు (జులై 5) హైదరాబాద్‌కు మొహమ్మద్‌ సిరాజ్‌.. భారీ రోడ్‌ షోతో ఘన స్వాగతం

Published on Fri, 07/05/2024 - 13:59

టీ20 వరల్డ్‌కప్‌లో విజయానంతరం ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్న లోకల్‌ బాయ్‌ మొహ్మమద్‌ సిరాజ్‌కు ఘన స్వాగతం లభించనుంది. సిరాజ్‌ను భారీ ఊరేగింపుతో ఇంటివరకు తీసుకెళ్లాలని అభిమానులు ప్రణాళిక వేశారు. ముంబైలో జరిగిన టీమిండియా విన్నింగ్‌ పెరేడ్‌ తరహాలో ఈ ఊరేగింపు కూడా జరగాలని సిరాజ్‌ ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

ఈ విజయోత్సవ ర్యాలీలో భాగ్యనగర వాసులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. విక్టరీ ర్యాలీకి సంబంధించిన సమాచారాన్ని సిరాజ్‌ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేశాడు. సిరాజ్‌ విక్టరీ ర్యాలీ ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు మెహిదిపట్నంలోని సరోజినీ కంటి ఆసుపత్రి వద్ద నుంచి ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీ ఈద్గా మైదానం వరకు సాగనుంది.

కాగా, టీమిండియా 13 ఏళ్ల ప్రపంచకప్‌ నిరీక్షణకు తెరదించుతూ టీ20 వరల్డ్‌కప్‌ 2024ను సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్‌ విజయానంతరం భారత క్రికెట్‌ జట్టు నిన్న (జులై 4) ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ ప్రధానితో భేటి అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబైకు వచ్చింది.

17 ఏళ్ల అనంతరం టీ20 వరల్డ్‌కప్‌తో తిరిగి రావడంతో భారత క్రికెట్‌ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విన్నింగ్‌ పెరేడ్‌లో భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ముంబై నగర వీధులు భారత క్రికెటర్ల నామస్మరణతో మార్మోగాయి.

విజయోత్సవ ర్యాలీ మెరైన రోడ్‌ గుండా సాగగా.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారత క్రికెటర్లు ఓపెన్‌ టాప్‌ బస్‌ నుంచి జనాలకు అభివాదం చేశారు. విన్నింగ్‌ పెరేడ్‌ మెరైన్‌ రోడ్‌ గుండా వాంఖడే స్టేడియం వరకు సాగింది. అనంతరం వాంఖడేలో భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆథ్వర్యంలో సన్మానం​ జరిగింది. భారత​ క్రికెటర్లను, వరల్డ్‌కప్‌ను చూసేందుకు స్టేడియంకు జనాలు పోటెత్తారు.
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)