Breaking News

T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన రో'హిట్‌'మ్యాన్‌ శర్మ.. రికార్డులు బద్దలు

Published on Fri, 06/28/2024 - 07:01

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో నిన్న (జూన్‌ 27) జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో తాను చేసిన 57 పరుగుల్లో 6 ఫోర్లు బాదిన హిట్‌మ్యాన్‌.. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో అత్యధిక బౌండరీలు బాదిన (43 మ్యాచ్‌ల్లో 113) ఆటగాడిగా శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే (111) రికార్డును బద్దలు కొట్టాడు. 

ఇదే మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కూడా బాదిన రోహిత్‌.. క్రిస్‌ గేల్‌ (63) తర్వాత టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో 50 సిక్సర్లు మార్కు తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ మరో రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు (22) బాదిన ఆటగాడిగా.. భారత కెప్టెన్‌గా 5000 పరుగుల మైలురాయిని దాటిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు

క్రిస్‌ గేల్‌- 63
రోహిత్‌ శర్మ- 50
జోస్‌ బట్లర్‌- 43
డేవిడ్‌ వార్నర్‌- 40
యువరాజ్‌ సింగ్‌- 33
విరాట్‌ కోహ్లి- 33

టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో అత్యధిక బౌండరీలు

రోహిత్‌ శర్మ- 113
జయవర్దనే- 111
విరాట్‌- 105
వార్నర్‌- 103
తిలకరత్నే దిల్షన్‌- 101

భారత కెప్టెన్‌గా అత్యధిక పరుగులు

విరాట్‌- 12883
ధోని- 11207
అజహారుద్దీన్‌- 8095
గంగూలీ- 7643
రోహిత్‌- 5012

ఐసీసీ నాకౌట్స్‌లో అత్యధిక సిక్సర్లు

రోహిత్‌ శర్మ- 22
క్రిస్‌ గేల్‌- 21

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్‌ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. 

రోహిత్‌ శర్మ (57), సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుల్దీప్‌ యాదవ్‌ (4-0-19-3), అక్షర్‌ పటేల్‌ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) భారత విజయంలో కీలకపాత్రలు పోషించారు. భారతకాలమానం రేపు (జూన్‌ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)