Breaking News

T20 World Cup 2024: టీమిండియా తదుపరి మ్యాచ్‌ వర్షార్పణం..?

Published on Thu, 06/13/2024 - 14:53

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా భారత్‌ ఆడబోయే తదుపరి మ్యాచ్‌ భారీ వర్షాల కారణంగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్‌ 15న భారత్‌.. కెనడాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు వేదిక అయిన ఫ్లోరిడాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ అమల్లో ఉంది. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

ఫ్లోరిడాలో భారత్‌-కెనడా మ్యాచ్‌తో పాటు మరో రెండు కీలక మ్యాచ్‌లు జరుగనున్నాయి. జూన్‌ 14న యూఎస్‌ఏ-ఐర్లాండ్‌.. జూన్‌ 16న ఐర్లాండ్‌-పాకిస్తాన్‌ జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్‌-ఏ నుంచి సూపర్‌-8కు చేరే క్రమంలో యూఎస్‌ఏ, పాకిస్తాన్‌లకు ఈ మ్యాచ్‌లు చాలా కీలకం.

ఇలా జరిగినా పాక్ ఇంటికే..
జూన్‌ 14న యూఎస్‌ఏ-ఐర్లాండ్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే పాకిస్తాన్‌ అధికారికంగా గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఎందుకంటే.. అమెరికా ఖాతాలో ఇప్పటికే నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఐర్లాండ్‌తో మ్యాచ్‌ రద్దైతే ఆ జట్టు ఖాతాలో మరో పాయింట్‌  చేరి మొత్తంగా ఐదు పాయింట్లు అవుతాయి. 

మరోవైపు.. పాక్‌ ఖాతాలో ప్రస్తుతం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అమెరికా- ఐర్లాండ్‌ మ్యాచ్‌ రద్దైతే.. పాక్‌ తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడించినా ఫలితం ఉండదు. ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉంటాయి. అప్పుడు యూఎస్‌ఏ.. భారత్‌తో పాటు గ్రూప్‌-ఏ నుంచి సూపర్‌-8కు అర్హత సాధిస్తుంది. భారత్‌ ఇ‍ప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి సూపర్‌-8కు క్వాలిఫై అయ్యింది. 
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)