Breaking News

T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన మిచెల్‌ స్టార్క్‌

Published on Fri, 06/21/2024 - 14:28

ఆసీస్‌ స్పీడ్‌ గన్‌ మిచెల్‌ స్టార్క్‌ చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌కప్‌ (వన్డే, టీ20)  చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అవతరించాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తంజిద్‌ హసన్‌ వికెట్‌ తీసిన స్టార్క్‌.. లంక దిగ్గజం లసిత్‌ మలింగకు అధిగమించి వరల్డ్‌కప్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 

వన్డే, టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో మలింగ 94 వికెట్లు (60 మ్యాచ్‌ల్లో) పడగొట్టగా.. స్టార్క్‌ 95 వికెట్లు (52 మ్యాచ్‌ల్లో) తీశాడు. ప్రపంచకప్‌ టోర్నీల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో స్టార్క్‌, మలింగ తర్వాతి స్థానాల్లో షకీబ్‌ అల్‌ హసన్‌ (77 మ్యాచ్‌ల్లో​ 92 వికెట్లు), ట్రెంట్‌ బౌల్ట్‌ (47 మ్యాచ్‌ల్లో 87 వికెట్లు), మురళీథరన్‌ (49 మ్యాచ్‌ల్లో 79 వికెట్లు) ఉన్నారు. 

స్టార్క్‌ ఖాతాలో ఉన్న 95 వరల్డ్‌కప్‌ వికెట్లలో 30 టీ20 వరల్డ్‌కప్‌ వికెట్లు.. 65 వన్డే వరల్డ్‌కప్‌ వికెట్లు ఉన్నాయి. స్టార్క్‌ ఇప్పటివరకు ఎనిమిది వరల్డ్‌కప్‌ టోర్నీల్లో పాల్గొన్నాడు. ఇందులో ఐదు టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలు (2012, 2014, 2021, 2022, 2024), మూడు వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలు (2015, 2019, 2023) ఉన్నాయి.

ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాట్‌ కమిన్స్‌ (4-0-29-3) హ్యాట్రిక్‌ వికెట్లతో చెలరేగడంతో ఆసీస్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన 28 పరుగుల తేడాతో  విజయం​ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌.. కమిన్స్‌, ఆడమ్‌ జంపా (4-0-24-2), మిచెల్‌ స్టార్క్‌ (4-0-21-1), మ్యాక్స్‌వెల్‌ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. 

బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ షాంటో (41), తౌహిద్‌ హ్రిదోయ్‌ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్‌ హసన్‌ 0, లిటన్‌ దాస్‌ 16, రిషద్‌ హొసేన్‌ 2, షకీబ్‌ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్‌ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్‌ అహ్మద్‌ 13, తంజిమ్‌ హసన్‌ సకీబ్‌ 4 పరుగులతో అజేయంగా నిలిచారు.

141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌.. 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం మొదలై మ్యాచ్‌కు అంతరాయం కలిగించి, డక్‌వర్త​ లూయిస్‌ పద్దతిన ఫలితాన్ని నిర్దారించేలా చేసింది. వర్షం మొదలయ్యే సమయానికి ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (35 బంతుల్లో 53 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్‌ (6 బంతుల్లో 14 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్‌.. ట్రవిస్‌ హెడ్‌తో (31) కలిసి ఆసీస్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు కలిసి పవర్‌ ప్లేలో 59 పరుగులు జోడించారు.  

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)