పెద్దగా సంబరాల్లేవ్‌!.. మా లక్ష్యం అదే: జింబాబ్వే కెప్టెన్‌

Published on Wed, 02/18/2026 - 10:00

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌లో ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జింబాబ్వే, శ్రీలంక జట్ల చేతిలో ఓటమి.. కంగారూలను సూపర్‌-8కు దూరం చేసింది. పల్లెకెలెలో మంగళవారం జరగాల్సిన జింబాబ్వే- ఐర్లాండ్‌ (ZIM vs IRE) మ్యాచ్‌ రద్దు కావడంతో ఆస్ట్రేలియా అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

లీగ్‌ దశలోనే
పేలవ ప్రదర్శనకు మూల్యం చెల్లిస్తూ కంగారూలు లీగ్‌ దశలోనే అవమానకర రీతిలో ఇంటిబాట పట్టగా.. జింబాబ్వే సగర్వంగా సూపర్‌-8లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో జింబాబ్వే కెప్టెన్‌ సికిందర్‌ రజా (Sikandar Raza)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సమిష్టిగా రాణించి
‘‘ఆఫ్రికా సబ్‌ రీజియనల్‌ క్వాలిఫైయర్స్‌లో మేము గ్రూప్‌-బిలో కెన్యా, రువాండా, టాంజానియా వంటి జట్లతో తలపడ్డాము. ఆ సమయంలో మా లక్ష్యం గెలుపు ఒక్కటే. లేదంటే జట్టు మొత్తం తమను తాము నిందించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పాను.

అక్కడ సమిష్టిగా రాణించి ప్రపంచకప్‌ టోర్నీలో అడుగుపెట్టాము. ఇప్పుడు సూపర్‌-8కు కూడా అర్హత సాధించాము. ఈ ఆనందాన్ని తప్పక సెలబ్రేట్‌ చేసుకుంటాం. అయితే, పెద్దగా సంబరాలు చేసుకోవడం లేదు.

మా లక్ష్యంలో మొదటి దశను మేము దాటాము. తదుపరి మేము శ్రీలంకతో మ్యాచ్‌ ఆడబోతున్నాం. ఆ మ్యాచ్‌ నామమాత్రమే అయినా గెలుపుపై గురిపెట్టాము. నేను, మా కోచ్‌ వారి బలాబలాల గురించి డేటాను పరిశీలిస్తున్నాం. అందుకు తగ్గట్లుగా మా వ్యూహాలు సిద్ధం చేసుకుంటాము.

అండర్‌డాగ్‌గా బరిలోకి
ఆ మ్యాచ్‌లోనూ గెలిచేందుకు వందకు వంద శాతం ప్రయత్నిస్తాం. సూపర్‌-8కు అర్హత సాధించినంత మాత్రాన మా లక్ష్యంలో ఎలాంటి మార్పూ ఉండదు. అండర్‌డాగ్‌గా బరిలోకి దిగి ఈ స్థాయికి చేరడం ఎవరికైనా సంతోషమే. అయితే, ప్రతిరోజూ కొత్తదే. కఠినంగా శ్రమిస్తేనే ఆశించిన ఫలితం వస్తుంది’’ అని సికిందర్‌ రజా పేర్కొన్నాడు.

కాగా గ్రూప్‌-బి నుంచి ఐర్లాండ్‌, ఒమన్‌, ఆస్ట్రేలియాలను ఎలిమినేట్‌ చేసి శ్రీలంక, జింబాబ్వే సూపర్‌-8కు చేరుకున్నాయి. ఇరుజట్లు గురువారం లీగ్‌ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో ముఖాముఖి తలపడతాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఇందుకు వేదిక.

చదవండి: IND vs NED: అతడిపై వేటు!.. భారత తుదిజట్టు ఇదే!

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)