Breaking News

T20 WC 2026: జింబాబ్వే మరో సంచలన విజయం సాధిస్తుందా..?

Published on Mon, 02/23/2026 - 10:59

టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 23) వెస్టిండీస్‌, జింబాబ్వే మధ్య సూపర్‌-8 సమరం జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం హోరాహోరీగా పోరాడే అవకాశం ఉంది. ఏ జట్టూ ఓటమిని అంత ఈజీగా ఒప్పుకోకపోవచ్చు. గ్రూప్‌ దశలో ఇరు జట్లు టాపర్లుగా నిలిచి సూపర్‌-8లోకి ప్రవేశించాయి. 

వెస్టిండీస్‌.. ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌, ఇటలీ, నేపాల్‌ జట్లపై విజయాలు సాధించి ఫైనల్‌-8కు అర్హత సాధించగా.. జింబాబ్వే గ్రూప్‌ దశలో పెను సంచలనాలే సృష్టించింది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆస్ట్రేలియా జట్టుకు షాకిచ్చిన జింబాబ్వే.. తమ కంటే మెరుగైన శ్రీలంకను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించింది. మరో మ్యాచ్‌లో పసికూన ఒమన్‌పై విజయం సాధించగా.. ఐర్లాండ్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది.

ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్‌ బరిలోకి దిగిన విండీస్‌, జింబాబ్వే.. గ్రూప్‌ దశలో అత్యుత్తమ ఫలితాలు సాధించడంతో నేటి మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీసే ఫేవరెట్‌ అయినా, జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ ఎడిషన్‌లో వారి ఆటతీరు చాలా మెరుగ్గా కనిపిస్తుంది. జట్టులో ప్రతి ఒక్కరు విజయాల కోసం శక్తివంచన లేకుండా కృష్టి చేస్తున్నారు. ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా కలిసికట్టుగా ఆడుతున్నారు. 

వారి ప్రధాన ఆయుధాలు కెప్టెన్‌ సికందర్‌ రజా, పేసర్‌ బ్లెస్సింగ్‌ ముజరబానీ. వీరిద్దరు మరోసారి చెలరేగితే విండీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఈ టోర్నీలో ఓపెనర్‌ బ్రియాన్‌ బెన్నెట్‌ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడు మరోసారి శుభారంభాన్ని ఇస్తే జింబాబ్వే భారీ స్కోర్‌ చేయగలుగుతుంది. ముజరబానీకి తోడుగా ఫామ్‌లో ఉన్న బ్రాడ్‌ ఈవాన్స్‌ కూడా రాణిస్తే.. విండీస్‌ బ్యాటర్లకు కష్టాలు తప్పవు.

విండీస్‌ విషయానికొస్తే.. ఈ జట్టు కూడా ప్రస్తుత ప్రపంచకప్‌లో కలిసికట్టుగా ఆడుతూ వరుస విజయాలు నమోదు చేసింది. గ్రూప్‌ దశలో ఈ జట్టు ఒక్క బలమైన జట్టుపైనే (ఇంగ్లండ్‌) విజయం సాధించినప్పటికీ.. చిన్న జట్లపై వారి విజయాలను తీసిపారేయడానికి వీల్లేదు. ఆ మ్యాచ్‌ల్లో విండీస్‌ ఆటగాళ్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ​అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టారు. 

మరోసారి అదే ప్రదర్శనలు పునరావృతమైతే తొలిసారి సెమీస్‌కు చేరాలనుకున్న జింబాబ్వేకు ఆశాభంగం కలగవచ్చు. గత నాలుగు మ్యాచ్‌ల్లో కీలకపాత్ర పోషించిన హోప్‌, హెట్‌మైర్‌, షెపర్డ్‌, మోటీ, హోల్డర్‌, షమార్‌ జోసఫ్‌పై విండీస్‌ మరోసారి భారీ అంచనాలు పెట్టుకుంది. గత మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రొమారియో షెపర్డ్‌ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రావడం విండీస్‌ బలాన్ని మరింత పెంచుతుంది. 70 (విండీస్‌)-30 (జింబాబ్వే) అంచనాలు ఉన్న ఈ మ్యాచ్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి. 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)