T20 WC 2026: సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. సికందర్‌ రజా విధ్వంసం

Published on Sun, 03/01/2026 - 17:23

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 1) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి. గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించగా.. జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఢిల్లీలోకి అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ అప్రధానమైన మ్యాచ్‌లో జింబాబ్వే టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

87 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జింబాబ్వేను సికందర్‌ రజా, క్లైవ్‌ మదండే (26 నాటౌట్‌) ఆదుకున్నారు. ముఖ్యంగా సికందర్‌ రజా ఆకాశమే హద్దుగా చెలరేగి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. రజా 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. మదండే 20 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

వీరు మినహా జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. మరుమణి 7, బ్రియాన్‌ బెన్నెట్‌ 15, డియాన్‌ మైర్స్‌ 11, ర్యాన్‌ బర్ల్‌ 5, టోనీ మున్యోంగా 2, బ్రాడ్‌ ఈవాన్స్‌ 8 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాకా, కార్బిన్‌ బాష్‌ చెరో 2.. లిండే, ఎంగిడి, నోర్జే తలో వికెట్‌ తీశారు.

అనంతరం​ 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాను బ్యాట్‌తో సత్తా చాటిన సికందర్‌ రజా ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్లు మార్క్రమ్‌ (4), డికాక్‌ (0)ను ఔట్‌ చేశాడు. 5 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్‌ 30-2గా ఉంది. రికెల్టన్‌ (19), బ్రెవిస్‌ (7) క్రీజ్‌లో ఉన్నారు.

 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)