Breaking News

T20 WC 2026: జింబాబ్వే ప్లేయర్‌ వరల్డ్‌ రికార్డు

Published on Tue, 02/24/2026 - 10:08

జింబాబ్వే రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ బ్రాడ్‌ ఈవాన్స్‌ పొట్టి క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా 28 ఇన్నింగ్స్‌ల్లో వికెట్‌ తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా వెస్టిండీస్‌తో నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

గతంలో ఈ రికార్డు శ్రీలంక మాజీ పేసర్‌ లసిత్‌ మలింగ, ఐర్లాండ్‌ పేసర్‌ మార్క్‌ అదైర్‌ పేరిట ఉండేది. మలింగ, అదైర్‌ వరుసగా 27 టీ20 ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఓ వికెటైనా తీశారు. తాజాగా ఈవాన్స్‌.. మలింగ, అదైర్‌ పేరిట సంయుక్తంగా ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు.

ఈ రికార్డుకు సంబంధించి ఈవాన్స్‌, మలింగ, అదైర్‌ను సమీపించేందుకు పాకిస్తాన్‌ వివాదాస్పద బౌలర్‌ ఉస్మాన్‌ తారిక్‌ అతి సమీపంలో ఉన్నాడు. తారిక్‌ ఇప్పటివరకు వరుసగా 25 ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఓ వికెటైన తీశాడు.

వెస్టిండీస్‌-జింబాబ్వే మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. హెట్‌మైర్‌ (85), రోవ్‌మన్‌ పావెల్‌ (59), రూథర్‌ఫోర్డ్‌ (31 నాటౌట్‌), షెపర్డ్‌ (21), హోల్డర్‌ (13) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. బ్రాడ్‌ ఈవాన్స్‌ (43), నగరవ (7 నాటౌట్‌) చివరి వికెట్‌కు 44 పరుగులు జోడించి జింబాబ్వేను 100 పరుగుల మార్కును దాటించారు. మోటీ (4-1-28-4), అకీల్‌ హొసేన్‌ (4-1-28-3) తమ స్పిన్‌ మాయాజాలంతో జింబాబ్వే పతనాన్ని శాశించారు.

 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)