Breaking News

T20 WC 2026: యూఎస్‌ఏకు మరో విజయం.. అదే జరిగితే పాక్‌ ఇంటికే..!

Published on Sun, 02/15/2026 - 18:42

టీ20 ప్రపంచకప్‌ 2026లో యూఎస్‌ఏ మరో విజయం సాధించింది. ఇప్పటికే నెదర్లాండ్స్‌పై గెలుపొందిన అమెరికా.. తాజాగా (ఫిబ్రవరి 15) నమీబియాను కూడా మట్టికరిపించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. యూఎస్‌ఏకు సూపర్‌-8కు చేరే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ.. ఈ రెండు విజయాలు భారీ ఊరట కలిగిస్తాయి. 

ఎందుకంటే ఈ జట్టు ఆడుతున్నది రెండో ప్రపంచకప్పే అయినా, పలు చిరస్మరణీయ విజయాలు సాధించి, చిన్న జట్లలో మేటి జట్టుగా పేరు తెచ్చుకుంది. తమ కంటే ముందు నుంచే ప్రపంచకప్‌ ఆడుతున్న నెదర్లాండ్స్‌, నమీబియా లాంటి జట్లను ఓడించడం యూఎస్‌ఏను ప్రత్యేకంగా నిలుపుతుంది. గత ఎడిషన్‌లో (2024) ఈ జట్టు, వారి కంటే చాలా రెట్లు మెరుగైన పాకిస్తాన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

ప్రస్తుత ఎడిషన్‌లోనూ యూఎస్‌ఏ నుంచి ఆ స్థాయి ప్రదర్శన ఆశించినప్పటికీ వీలు పడలేదు. అయితే పాక్‌తో పాటు భారత్‌కు కూడా టఫ్‌ ఫైట్‌ ఇచ్చి అభిమానుల మనసులు గెలుచుకుంది. ఈ ఎడిషన్‌లోనూ యూఎస్‌ఏకు సూపర్‌-8కు చేరుకునే అవకాశాలు లేకపోలేదు. 

పాక్‌.. భారత్‌, నమీబియా చేతుల్లో ఓడితే యూఎస్‌ఏకు సూపర్‌-8 బెర్త్‌ దక్కే అవకాశం ఉంది. ఇది జరిగితే పాక్‌, యూఎస్‌ఏ ఖాతాల్లో తలో నాలుగు పాయింట్లు ఉంటాయి. అప్పుడు పాక్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ కలిగి ఉంటే, యూఎస్‌ఏ  సూపర్‌-8కి అర్హత సాధిస్తుంది. 

ఇలా జరగడం కష్టమైనా, అవకాశాలను మాత్రం తీసి పారేయడానికి వీల్లేదు. ఎందుకంటే భారత్‌, నమీబియాకు పాక్‌ను ఓడించేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. నమీబియాకు గతంలో వారి కంటే మెరుగైన జట్లకు షాకిచ్చిన అనుభవం ఉంది. ఇది మరోసారి రిపీటైతే మాత్రం యూఎస్‌ఏ సూపర్‌-8కు, పాక్‌ ఇంటికి చేరతాయి.

యూఎస్‌ఏ-నమీబియా మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏ 31 పరుగుల తేఆతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ (199-4) చేసిన యూఎస్‌ఏ.. ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. యూఎస్‌ఏ తరఫున బ్యాటింగ్‌లో కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌ (52), సంజయ్‌ కృష్ణమూర్తి (68 నాటౌట్‌) రాణించారు. నమీబియా బౌలర్లలో మైబుర్గ్‌, కెప్టెన్‌ ఎరాస్మస్‌ తలో 2 వికెట్లు తీశారు.

అనంతరం నమీబియా యూఎస్‌ఏ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఎస్‌ఏ బౌలర్లు నమీబియా బ్యాటర్లను కట్టడి చేశారు. స్కాల్విక్‌ 2, శుభమ్‌ రంజనే, నేత్రావల్కర్‌, అలీ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు. నమీబియా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ స్టీన్‌కా​ంప్‌ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు