Breaking News

టీ20 ప్రపంచకప్‌లో నేడు మరో సూపర్‌ మ్యాచ్‌

Published on Wed, 02/25/2026 - 10:42

టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 25) మరో సూపర్‌-8 మ్యాచ్‌ జరుగనుంది. ఆతిథ్య శ్రీలంకను న్యూజిలాండ్‌ కొలొంబో వేదికగా ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు డూ ఆర్‌ డై మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఇరు జట్లు సెమీస్‌ రేసులో ఉంటాయి. ఓడినా ఛాన్స్‌లు ఉంటాయి కానీ, అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారతాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఈ మ్యాచ్‌ చాలా కీలకం.

శ్రీలంక తొలి సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడి సెమీస్‌ రేసులో చిట్టచివరి స్థానంలో ఉండగా.. పాక్‌తో జరగాల్సిన మ్యాచ్‌ రద్దై న్యూజిలాండ్‌ రెండో స్థానంలో ఉంది. గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌ సెమీస్‌ బెర్త్‌ ఖరారు కావడంతో మిగిలిన బెర్త్‌ కోసం న్యూజిలాండ్‌-పాక్‌-శ్రీలంక మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది.

న్యూజిలాండే ఫేవరెట్‌
నేటి మ్యాచ్‌లో ఏ జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయని పరిశీలిస్తే.. న్యూజిలాండే ఫేవరెట్‌ అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. గ్రూప్‌ దశలో ఈ జట్టు నాలుగింట మూడు మ్యాచ్‌ల్లో (సౌతాఫ్రికా మినహా) గెలిచింది. 

శ్రీలంక సైతం నాలుగింట మూడు మ్యాచ్‌ల్లోనే గెలిచినప్పటికీ (జింబాబ్వే మినహా).. బలాబలాల ప్రకారం న్యూజిలాండ్‌దే ఆధిక్యత కనిపిస్తుంది. గ్రూప్‌ దశలో ఆసీస్‌పై సంచలన విజయం సాధించినా, హోం అడ్వాంటేజ్‌ ఉన్నా.. బలాబలాలను పరిగణలోకి తీసుకుంటే న్యూజిలాండ్‌పై గెలవడం శ్రీలంకకు చాలా కష్టమనే చెప్పాలి.

రికార్డులు కూడా ఇదే చెబుతున్నాయి
ఇరు జట్ల మధ్య హెడ్‌ టు హెడ్‌ రికార్డులను పరిశీలించినా, న్యూజిలాండ్‌దే అధిపత్యమని చెబుతున్నాయి. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 28 టీ20 మ్యాచ్‌లు జరగగా.. న్యూజిలాండ్‌ 16, శ్రీలంక 11 మ్యాచ్‌లు గెలిచాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. 

శ్రీలంకలో జరిగిన మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్‌ ఆధిపత్యమే కనిపిస్తుంది. లంకలో ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. న్యూజిలాండ్‌ 5, శ్రీలంక 3 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది.

తుది జట్లు (అంచనా)
న్యూజిలాండ్‌: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జేమ్స్ నీషమ్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్‌ 

శ్రీలంక: పతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుసల్ మెండిస్(w), పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(c), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)