Breaking News

T20 WC 2026: సూపర్‌-8లోకి పాకిస్తాన్‌

Published on Wed, 02/18/2026 - 19:15

టీ20 ప్రపంచకప్‌ 2026లో పాకిస్తాన్‌ ఎట్టకేలకు సూపర్‌-8కు అర్హత సాధించింది. పసికూన నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన మ్యాచ్‌లో 102 పరుగుల భారీ తేడాతో గెలిచి చివరి సూపర్‌-8 బెర్త్‌ దక్కించు​కుంది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌ ఆటగాళ్లు పసికూనలపై ప్రతాపం చూపించారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో చెలరేగి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. పాక్‌ సూపర్‌-8కు అర్హత సాధించడంతో అప్పటిదాకా పోటీలో ఉన్న యూఎస్‌ఏ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (58 బంతుల్లో 100 నాటౌట్‌; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో షాదాబ్‌ ఖాన్‌ (22 బంతుల్లో 36 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు), కెప్టెన్‌ సల్మాన్‌ అఘా (23 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో రాణించగా.. సైమ్‌ అయూబ్‌ (12 బంతుల్లో 14; 2 ఫోర్లు), ఖ్వాజా నఫాయ్‌ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.

నమీబియా బౌలర్లలో బెర్నాల్డ్‌ స్కోల్జ్‌ (4-0-33-0), రూబెన్‌ ట్రంపల్మెన్‌ (4-0-36-0) పొదుపుగా బౌలింగ్‌ చేయగా.. జాక్‌ బ్రస్సెల్‌ (4-0-48-2) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా, వికెట్లు తీశాడు. కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (3-0-25-1), జేజే స్మిట్‌ (3-0-28-0) పర్వాలేదనిపించారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా పాక్‌ స్పిన్నర్ల ధాటికి చేతులెత్తేసింది. ఉస్మాన్‌ తారిఖ్‌ (3.3-1-16-4), షాదాబ్‌ ఖాన్‌ (4-0-19-3), మొహమ్మద్‌ నవాజ్‌ (4-0-22-1) దెబ్బకు 17.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ సల్మాన్‌ మీర్జా కూడా ఓ వికెట్‌ తీశాడు. నమీబియా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ లారెన్‌ స్టీన్‌కాంప్‌ (23), మిడిలార్డర్‌ బ్యాటర్‌ అలెగ్జాండర్‌ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ ఓటమితో నమీబియా ఒక్క గెలుపు కూడా లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)