T20 WC 2026: కొనసాగుతున్న సౌతాఫ్రికా జైత్రయాత్ర

Published on Wed, 02/18/2026 - 15:18

టీ20 ప్రపంచకప్‌ 2026లో గత ఎడిషన్‌ రన్నరప్‌ సౌతాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రొటీస్‌ జట్టు వరుసగా నాలుగో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లోనూ గెలిచి అజేయ జట్టుగా సూపర్‌-8లోకి ప్రవేశించింది. యూఏఈతో ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన తమ చివరి గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన సౌతాఫ్రికా యూఏఈని 122 పరుగులకే (6 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. కార్బిన్‌ బాష్‌ (4-0-12-3), అన్రిచ్‌ నోర్జే (4-0-28-2), జార్జ్‌ లిండే (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో అలీషాన్‌ షరాఫు (45) టాప్‌ స్కోరర్‌గా కాగా.. మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరిలో కెప్టెన్‌ ముహమ్మద్‌ వసీం 22, ఆర్యాంశ్‌ శర్మ 13, ముహమ్మద్‌ అర్ఫాన్‌ 11 పరుగులు చేశారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (36), ర్యాన్‌ రికెల్టన్‌ (30), కెప్టెన్‌ మార్క్రమ్‌ (28), డికాక్‌ (14), స్టబ్స్‌ (6 నాటౌట్‌), జేసన్‌ స్మిత్‌ (3 నాటౌట్‌) తలో చేయి వేసి ప్రొటీస్‌ను గెలిపించారు. యూఏఈ బౌలర్లలో హైదర్‌ అలీ, జవాదుల్లా, అర్ఫాన్‌, ఫరూఖ్‌ తలో వికెట్‌ తీశారు. ఈ ఓటమితో ప్రపంచకప్‌లో యూఏఈ పోరాటం ముగిసింది. ఈ జట్టు కెనడాపై మాత్రమే గెలిచి న్యూజిలాండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, సౌతాఫ్రికా జట్ల చేతుల్లో ఓడింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)