Breaking News

T20 WC 2026: చరిత్ర సృష్టించిన రషీద్‌ ఖాన్‌

Published on Mon, 02/16/2026 - 15:24

ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు, ఈ జనరేషన్‌ అత్యుత్తమ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. యావత్‌ పొట్టి ఫార్మాట్‌లో (అంతర్జాతీయ టీ20లు, ప్రైవేట్‌ లీగ్‌లు) 700 వికెట్ల మైలురాయిని తాకిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. 

2015లో కెరీర్‌ మొదలుపెట్టిన రషీద్‌ టీ20 ఫార్మాట్‌లో 517 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతని సగటు 18.5 కాగా.. ఎకానమీ 6.59గా ఉంది. రషీద్‌ తన టీ20 కెరీర్‌లో 5 వికెట్ల ఘనతలు నాలుగు సార్లు.. 4 వికెట్ల ఘనతలు 18 సార్లు నమోదు చేశాడు. రషీద్‌ కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలు 6-17గా ఉన్నాయి. రషీద్‌ తన జాతీయ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో టీ20 క్రికెట్‌ ఆడాడు. 

అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్‌ తర్వాతి స్థానాల్లో (టాప్‌-5) విండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో, విండీస్‌ మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ (613), సౌతాఫ్రికా వెటరన్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ (572), విండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ (508) ఉన్నారు. 

రషీద్‌ ఖాతాలో అత్యధిక టీ20 వికెట్ల రికార్డుతో పాటు చాలా ఆల్‌టైమ్‌ గ్రేట్‌ రికార్డులు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో రషీద్‌ నాలుగు హ్యాట్రిక్‌లు నమోదు చేశాడు. రషీద్‌ తన టీ20 కెరీర్‌లో 432 మంది స్పెషలిస్ట్‌ బ్యాటర్లను ఔట్‌ చేశాడు. టీ20ల్లో ఏ బౌలర్‌ ఇంతమంది స్పెషలిస్ట్‌ బ్యాటర్లను ఔట్‌ చేయలేదు. 

అలాగే రషీద్‌ భారత్‌, యూఏఈ, ఆస్ట్రేలియా దేశాల్లో 100కు పైగా వికెట్లు తీశాడు. ఈ ఘనత కూడా ఎవరూ సాధించలేదు. రషీద్‌ ఒక్క ఆసియా ఖండంలోనే 400కు పైగా వికెట్లు తీశాడు. ఈ ఘనత కూడా ఎవరి వల్ల కాలేదు. 2017 నుంచి 2025 వరకు రషీద్‌ ప్రతి ఏడాది కనీసం 50 వికెట్లు తీశాడు. 

ఇది కూడా ఎవరూ సాధించలేదు. బౌల్డ్‌ లేదా ఎల్బీడబ్ల్యూ ద్వారా రషీద్‌ 379 వికెట్లు తీశాడు. ఈ ఘనత కూడా కేవలం రషీద్‌కు మాత్రమే సొంతం. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో విలియం లిల్లీవైట్‌, లిస్ట్‌-ఏ క్రికెట్‌లో వసీం​ అక్రమ్‌, టీ20 ఫార్మాట్‌లో రషీద్‌ ఖాన్‌ 700 వికెట్ల మైలురాయిని తాకిన తొలి బౌలర్లు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. యూఏఈపై ఆఫ్ఘనిస్తాన్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. షోయబ్‌ ఖాన్‌ (68) అర్ద సెంచరీతో రాణించగా.. అలీషాన్‌ షరాఫు (40) పర్వాలేదనిపించాడు. 

ఆఫ్ఘన్‌ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 4 వికెట్లతో చెలరేగాడు. ముజీబ్‌ రెహ్మాన్‌ 2, రషీద్‌ ఖాన్‌ ఓ వికెట్‌ సాధించారు. ఈ వికెటే రషీద్‌కు టీ20ల్లో 700వ వికెట్‌.

అనంతరం బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇబ్రహీం జద్రాన్‌ (53) ఆఫ్ఘన్‌ గెలుపుకు పునాది వేయగా.. ఒమర్‌జాయ్‌ (40 నాటౌట్‌) తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)