Breaking News

T20 WC 2026: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌ ఆటగాళ్లు

Published on Thu, 02/26/2026 - 10:06

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా శ్రీలంకతో నిన్న (ఫిబ్రవరి 25) జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 61 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్‌ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఈ ఓటమితో ఆతిథ్య శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 84 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (47), కోల్‌ మెక్‌కోంచి (31 నాటౌట్‌) ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 84 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు.

ఈ క్రమంలో సాంట్నర్‌-మెక్‌కోంచి జోడీ ఓ వరల్డ్‌కప్‌ రికార్డును బద్దలు కొట్టింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు మైక్‌ హస్సీ-స్టీవ్‌ స్మిత్‌ పేరిట ఉండేది. 2010 ఎడిషన్‌లో బంగ్లాదేశ్‌పై ఈ జోడీ ఏడో వికెట్‌కు 74 పరుగులు జోడించింది. తాజాగా సాంట్నర్‌-మెక్‌కోంచి జోడీ ఈ రికార్డును బద్దలు కొట్టింది.

డెత్ ఓవర్లలో దూకుడు
డెత్‌ ఓవర్లలో సాంట్నర్‌-మెక్‌కొంచి జోడీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. చివరి నాలుగు ఓవర్లలో ఏకంగా 70 పరుగులు రాబట్టింది. 17వ ఓవర్‌లో 18, 18వ ఓవర్‌లో 21, చివరి రెండు ఓవర్లలో 19 మరియు 12 పరుగులు పిండుకుంది.

అరుదైన మైలురాయిని తాకిన సాంట్నర్‌
ఈ మ్యాచ్‌లో 47 పరుగులు చేయడంతో సాంట్నర్‌ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేయడంతో పాటు 100 వికెట్లు తీసిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో మొహమ్మద్ నబీ, హార్దిక్ పాండ్యా, షకీబ్ అల్ హసన్ వంటి ప్రముఖులు ఉన్నారు.

బెంబేలెత్తించిన హెన్రీ.. తిప్పేసిన స్పిన్నర్లు
169 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్‌ బౌలర్లు ఆది నుంచే రెచ్చిపోయారు. ముఖ్యంగా మ్యాట్‌ హెన్రీ (2-1-3-2) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి బంతికే ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ నిస్సంకను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన హెన్రీ.. ఆతర్వాతి ఓవర్‌లో అసలంకను పెవిలియన్‌కు పంపాడు. 

ఆతర్వాత స్పిన్నర్లు లైన్‌లోకి వచ్చి లంక ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేశారు. వీరిలో రచిన్‌ రవీంద్ర (4-0-27-4) లంక పతనాన్ని శాశించారు. సాంట్నర్‌ (4-0-19-1), గ్లెన్‌ ఫిలిప్స్‌ (4-0-21-1) పొదుపుగా బౌలింగ్‌ చేసి లంక ఆటగాళ్లను కట్టడి చేశారు. 

ఫలితంగా శ్రీలంక నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసిన కమిందు మెండిసే టాప్‌ స్కోరర్‌.

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)