Breaking News

T20 WC: అలెన్‌ విధ్వంసకర శతకం.. వరల్డ్‌కప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌

Published on Wed, 03/04/2026 - 21:56

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో న్యూజిలాండ్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. కోల్‌కతాలో జరిగిన తొలి సెమీస్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో బుధవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కివీస్‌.. సౌతాఫ్రికాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ న్యూజిలాండ్‌ బౌలర్లు ఆది నుంచే నిప్పులు చెరిగారు. క్వింటన్‌ డికాక్‌ (10)ను అవుట్‌ చేసి కివీస్‌ వికెట్ల వేట మొదలుపెట్టిన కోల్‌ మెకాంచీ.. వన్‌డౌన్‌లో వచ్చిన ర్యాన్‌ రికెల్టన్‌ (0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఇక మరో ఓపెనర్‌, కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ (18)ను రచిన్‌ రవీంద్ర పెవిలియన్‌కు చేర్చాడు.

యాన్సెన్‌ హాఫ్‌ సెంచరీ
అదే విధంగా డారిల్‌ మిచెల్‌ (6)ను కూడా అవుట్‌ చేసిన రచిన్‌ కివీస్‌ శిబిరంలో జోష్‌ నింపాడు. ఇక డెవాల్డ్‌ బ్రెవిస్‌ (34)ను జేమ్స్‌ నీషమ్‌ అవుట్‌ చేయగా.. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (29)ను లాకీ ఫెర్గూసన్‌ పెవిలియన్‌కు పంపించాడు. అయితే, మార్కో యాన్సెన్‌ హాఫ్‌ సెంచరీ (30 బంతుల్లో 55) నాటౌట్‌గా నిలవడంతో సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ 12.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్‌ నష్టపోయి 173 పరుగులు సాధించింది. ఓపెనర్లలో టిమ్‌ సీఫర్ట్‌ 33 బంతుల్లో 58 పరుగులు సాధించగా.. ఫిన్‌ అలెన్‌ విధ్వంసకర శతకం బాదాడు. 

ఫాస్టెస్ట్‌ సెంచరీ
కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫోర్‌ బాది కివీస్‌ గెలుపును ఖరారు చేశాడు. రచిన్‌ రవీంద్ర 11 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌ సందర్భంగా టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా అలెన్‌ చరిత్ర సృష్టించాడు. 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)