T20 WC 2026: ఇంగ్లండ్‌పై కీలక ప్రదర్శన.. చరిత్ర సృష్టించిన బుమ్రా

Published on Fri, 03/06/2026 - 10:19

భారత ప్రీమియం ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా టీ20 ప్రపంచకప్‌ 2026 సందర్భంగా ఓ చరిత్రాత్మక మైలురాయిని తాకాడు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో నిన్న (మార్చి 5) జరిగిన రెండో సెమీఫైనల్లో హ్యారీ బ్రూక్‌ వికెట్‌ తీయడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత అరుదైన 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఈ మ్యాచ్‌లో తన స్పెల్‌ తొలి బంతికే ఈ ఘనత సాధించాడు. 

32 ఏళ్ల బుమ్రా ఇప్పటివరకు 52 టెస్ట్‌ల్లో 234 వికెట్లు.. వన్డేల్లో 89 మ్యాచ్‌ల్లో 149.. టీ20ల్లో 94 మ్యాచ్‌ల్లో 117 వికెట్లు తీశాడు.

2016 జనవరి 23న అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బుమ్రా.. అతి తక్కువ వ్యవధిలోనే 500 వికెట్ల మైలురాయిని తాకాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదవ భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బుమ్రాకు ముందు అనిల్‌ కుంబ్లే, అశ్విన్‌, హర్భజన్‌, కపిల్‌ దేవ్‌, రవీంద్ర జడేజా, జహీర్‌ ఖాన్‌, జవగల్‌ శ్రీనాథ్‌ ఈ ఘనత సాధించారు.

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సామర్థ్యం మేరకు సత్తా చాటుతున్న బుమ్రా.. నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అత్యంత కీలకపాత్ర పోషించాడు. 254 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ గెలుపు దిశగా పయనిస్తున్న వేల ఓ పొదుపైన ఓవర్‌తో మ్యాచ్‌ను భారత్‌వైపు మల్లించాడు.

18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్‌ బంతిని అందుకున్న హార్దిక్‌ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్‌ కర్రన్‌ను ఔట్‌ చేయడంతో పాటు ఆ ఓవర్‌లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్‌కు గెలుపుపై ధీమా వచ్చింది.

చివరి ఓవర్‌ వేసిన దూబే తొలి బంతికే విధ్వంసకర సెంచరీతో (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరంగం సృష్టించిన బేతెల్‌ను ఔట్‌ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్‌ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినప్పటికీ (ఆర్చర్‌) అప్పటికే ఇంగ్లండ్‌ ఓటమి ఖరారైపో​యింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా అత్యంత పొదుపైన బౌలర్‌గా నిలవడంతో పాటు మ్యాచ్‌ మలుపు తిప్పే ఓవర్‌ వేసి అత్యంత​ కీలకమైన హ్యారీ బ్రూక్‌ వికెట్‌ తీశాడు.

ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. గ్రూప్‌ దశలో పాకిస్తాన్‌, సూపర్‌-8లో విండీస్‌.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై కీలక ప్రదర్శనలు చేసి మొత్తం 10 వికెట్లు తీశాడు.

వరుసగా రెండో మ్యాచ్‌లో సంజూ హిట్‌
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. సంజూ శాంసన్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో ఇరగదీయడంతో (89) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ (39), శివమ్‌ దూబే (43), హార్దిక్‌ పాండ్యా (27), తిలక్‌ వర్మ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు. కాగా, భారత్‌ మార్చి 8న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతుంది.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)