Breaking News

సిక్సర్లతో విరుచుకుపడిన శివమ్‌ దూబే.. టీమిండియా భారీ స్కోర్‌

Published on Wed, 02/18/2026 - 20:59

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 18) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

శివమ్‌ దూబే (31 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) సిక్సర్లతో విరుచుకుపడి భారత్‌కు భారీ స్కోర్‌ అందించాడు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (21 బంతుల్లో 30; 3 సిక్సర్లు) కూడా ఓ మోస్తరు మెరుపులు మెరిపించాడు. ఆఖరి ఓవర్‌లో 3 బంతులు ఎదుర్కొన్న రింకూ సింగ్‌ ఓ సిక్సర్‌ బాది అజేయంగా నిలిచాడు.

అంతకుముందు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (28 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్‌), తిలక్‌ వర్మ (27 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్‌) నిదానంగా ఆడి విసుగు తెప్పించారు.   వారికి ముందు ఇషాన్‌ కిషన్‌ (7 బంతుల్లో 18; 2 ఫోర్లు, సిక్స్‌) తన సహజ శైలిలో మెరుపులు మెరిపించాడు. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఆర్యన్‌ దత్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

ఈ మెగా టోర్నీలో దారుణమైన ఫామ్‌లో ఉన్న అభిషేక్‌ శర్మ ఈ మ్యాచ్‌లోనూ ఉసూరుమనిపించాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ డకౌటై టీమిండియా అభిమానులను నిరాశపరిచాడు.

నెదర్లాండ్స్‌ బౌలర్లలో లోగాన్‌ వాన్‌ బీక్‌ (4-0-56-3) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా, వికెట్లు తీశాడు. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌, అభిషేక్‌ శర్మను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన ఆర్యన్‌ దత్‌ (4-0-19-2) కెరీర్‌లోనే అత్యుత్తమ స్పెల్‌ వేశాడు. 

బాస్‌ డి లీడ్‌ (4-0-28-0) పొదుపుగా బౌలింగ్‌ చేసి పర్వాలేదనిపించాడు. 19వ ఓవర్‌లో మాత్రమే 21 పరుగులిచ్చిన కైల్‌ క్లెయిన్‌ (4-0-38-1) అంతకుముందు ఓవర్లలో టీమిండియా బ్యాటర్లను కట్టడి చేశాడు. కొలిన్‌ ఆకెర్‌మన్‌ (3-0-36-0), వాన్‌ డర్‌ మెర్వ్‌ (1-0-15-0) కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

కాగా, ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్‌ సూపర్‌-8కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. నెదర్లాండ్స్‌కు సైతం ఈ మ్యాచ్‌ ఫలితంతో ఎలాంటి ఉపయోగం లేదు. ఈ జట్టు ఇప్పటికే ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింట ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు