సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. అయినా, టీమిండియాదే వరల్డ్‌కప్‌..!

Published on Mon, 02/23/2026 - 12:43

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 22) సౌతాఫ్రికాతో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో భారత్‌ 76 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలోనే భారత్‌కు ఇది అతి పెద్ద ఓటమి. ఈ ఓటమితో ఐసీసీ టోర్నీల్లో టీమిండియా జైత్రయాత్రకు కూడా బ్రేక్‌ పడింది. 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ తర్వాత భారత్‌ ఈ మ్యాచ్‌లోనే (ఐసీసీ టోర్నీల్లో) ఓటమిపాలైంది. 

ఈ ఓటమితో భారత్‌ సెమీస్‌ అవకాశాలను సైతం కఠినం చేసుకుంది. మిగతా రెండు సూపర్‌-8 మ్యాచ్‌ల్లో జింబాబ్వే, వెస్టిండీస్‌పై విజయం సాధించినా.. భారత్‌ సెమీస్‌కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే, సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత నెట్‌ రన్‌రేట్‌ -3.80కు పడిపోయింది. 

ఇది మెరుగుపడాలంటే భారత్‌ తదుపరి 2 మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాలి. అలాగే విండీస్‌, జింబాబ్వే.. సౌతాఫ్రికా చేతిలోనూ ఓడాలి. ఇలా జరిగినప్పుడే భారత్‌ సెమీస్‌కు చేరుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా జరగడం కాస్త కష్టమే అయినా అసాధ్యమైతే కాదు.

ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ టీమిండియాను ఓ సెంటిమెంట్‌ ఏకంగా టైటిల్‌నే ఊరిస్తుంది. అదేంటంటే.. స్వదేశంలో జరిగిన 2011 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ గ్రూప్‌ దశలో సౌతాఫ్రికా చేతిలో ఓడినా, టైటిల్‌ గెలిచింది. అలాగే స్వదేశంలోనే జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లోనూ భారత్‌ సూపర్‌-8లో సౌతాఫ్రికా చేతిలో ఓడినా, టైటిల్‌ గెలుస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. 

ఈ సెంటిమెంట్‌ సోషల్‌మీడియాలో భారత అభిమానులకు సౌతాఫ్రికా చేతిలో పరాభవాన్ని మరిచిపోయేలా చేస్తుంది. మరి ఈ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందో లేదో చూడాలి.

కాగా, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్‌ బౌలింగ్‌ విభాగంలో పర్వాలేదనిపించినా, బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ఛేదించగలిగే లక్ష్యమే అయినా ఒత్తిడికి చిత్తై చేతులెత్తేశారు.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. భారత పేసర్లు జస్ప్రీత్‌ బుమ్రా (4-0-15-3), అర్షదీప్‌ సింగ్‌ (4-0-28-2) 20 పరుగులకే 3 వికెట్లు తీసి ఇబ్బంది పెట్టినా, ఆతర్వాత డెవాల్డ్‌ బ్రెవిస్‌ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (35 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (24 బంతుల్లో 44 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) మెరుపు విన్యాసాలతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు ఆదిలోనే చేతులెత్తేశారు. ఇన్నింగ్స్‌ నాలుగో బంతికే ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌ డకౌటయ్యాడు. ఆతర్వాత రెండు బంతులకే ఫామ్‌లో లేని తిలక్‌ వర్మ (1) కూడా పెవిలియన్‌కు చేరాడు. గత మూడు మ్యాచ్‌ల్లో డకౌటై ఒత్తిడిలో ఉన్న అభిషేక్‌ శర్మ (15) మరోసారి అదే ఒత్తిడికి చిత్తయ్యాడు. 

సూర్యకుమార్‌ యాదవ్‌ (18) బంతులు వృధా చేశాక నిస్సహాయ స్థితిలో ఔటయ్యాడు. వాషి​ంగ్టన్‌ సుందర్‌కు (11) ప్రమోషన్‌ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. శివమ్‌ దూబే (42) తన సహజ శైలిలో వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. హార్దిక్‌ (18), రింకూ (0) కూడా నిరాశపరిచారు.

మొత్తంగా భారత్‌ 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రి​​కా బౌలర్లు జన్సెన్‌ (3.5-0-22-4), కేశవ్‌ మహారాజ్‌ (3-0-24-3), కార్బిన్‌ బాష్‌ (3-0-12-2), మార్క్రమ్‌ (1-0-5-1) భారత పతనాన్ని శాశించారు. ఎంగిడి (4-0-15-0), రబాడ (4-0-32-0) వికెట్లు తీయలేకపోయినా అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)