గంభీర్‌ బాటలో అభిషేక్‌ శర్మ.. ఇలా చేశావేంటి బ్రో?

Published on Sat, 02/07/2026 - 20:17

టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో ఈ పంజాబీ బ్యాటర్‌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. తద్వారా ఓ చెత్త రికార్డును అభిషేక్‌ శర్మ తన పేరిట లిఖించుకున్నాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత టీ20 జట్టు ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్‌ శర్మ ధనాధన్‌ బ్యాటింగ్‌తో విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.

గత కొన్నాళ్లుగా మంచి ఫామ్‌లో ఉన్న అభిషేక్‌.. కెరీర్‌లో తొలి ప్రపంచకప్‌ టోర్నీకి సిద్ధమయ్యాడు. ముంబైలోని వాంఖడే వేదికగా వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో అమెరికాతో తలపడునుండటంతో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ అదరగొడతాడని అంతా భావించారు.

అయితే, ఊహించని రీతిలో అభిషేక్‌ శర్మ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌ చేరాడు. అమెరికా పేసర్‌ అలీ ఖాన్‌ బౌలింగ్‌లో సంజయ్‌ కృష్ణమూర్తికి క్యాచ్‌ ఇచ్చిన ఈ లెఫ్టాండర్‌ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. తద్వారా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో అరంగేట్ర మ్యాచ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగిన ఐదో భారత బ్యాటర్‌గా నిలిచాడు. కాగా టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ సైతం ఇలాగే అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు.

ఇక అభిషేక్‌ శర్మ కూడా ఇప్పుడు అదే తరహాలో అవుట్‌కావడంతో.. “గంభీర్‌ బాటలో నడిచిన అభిషేక్‌ శర్మ.. నీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాం.. ఇలా చేశావేంటి బ్రో’’ అంటూ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండగా.. పవర్‌ ప్లేలోనే 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా.

టీ20 వరల్డ్‌కప్‌ అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్‌ అయిన భారత ఆటగాళ్లు వీరే
👉గౌతం గంభీర్‌
👉ఆశిష్‌ నెహ్రా (గోల్డెన్‌ డక్‌)
👉శార్దూల్‌ ఠాకూర్‌
👉దీపక్‌ హుడా
👉అభిషేక్‌ శర్మ (గోల్డెన్‌ డక్‌).

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)