ఈ సెంటిమెంట్‌ రిపీటైతే టీమిండియాదే వరల్డ్‌కప్‌..!

Published on Fri, 02/13/2026 - 20:48

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 13) పెను సంచలనం నమోదైంది. పసికూన జింబాబ్వే.. 2021 ఎడిషన్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఆల్‌రౌండ్‌ పెర్ఫార్మెన్స్‌తో మాజీ జగజ్జేతను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.

వాస్తవానికి టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం ఇది మొదటిసారి కాదు. పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభ ఎడిషన్‌లోనే (2007) జింబాబ్వే ఆసీస్‌కు ఊహించని షాక్‌ ఇచ్చింది. ప్రపంచకప్‌ల పరంగా చూసుకుంటే, జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం ఇది ‍కూడా తొలిసారి కాదు. 

1983 వన్డే ప్రపంచకప్‌లోనే జింబాబ్వే తొలిసారి ఆసీస్‌ను ఓడించింది. మొత్తంగా జింబాబ్వే తమ క్రికెట్‌ చరిత్రలో వారికంటే చాలా రెట్లు మెరుగైన ఆస్ట్రేలియాను ఐదు సార్లు ఓడించింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో రెండు సార్లు (2007, 2026), వన్డే వరల్డ్‌కప్‌లో ఒకసారి (1983), సాధారణ వన్డేల్లో రెండు సార్లు (2014, 2022) జింబాబ్వే ఆసీస్‌కు షాకిచ్చింది.

అయితే జింబాబ్వే ఆసీస్‌పై సాధించిన విషయాల్లో ఓ ఆసక్తికర విషయం దాగి ఉంది. అది భారత క్రికెట్‌ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే అంశం. అదేంటంటే.. జింబాబ్వే ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆసీస్‌పై విజయం సాధించిన తొలి రెండు సందర్భాల్లో భారత్‌ జగజ్జేతగా నిలిచింది. జింబాబ్వే తొలిసారి ఆసీస్‌పై విజయం సాధించిన సందర్భంలో భారత్‌ తొలిసారి జగజ్జేతగా నిలిచింది. జింబాబ్వే ఆసీస్‌పై రెండోసారి విజయం సాధించిన సందర్భంలో భారత్‌ రెండో సారి జగజ్జేతగా నిలిచింది.

ప్రస్తుత ప్రపంచకప్‌లో ఈ సెంటిమెంట్‌ రిపీటైతే, భారత్‌ మరోసారి జగజ్జేతగా అవతరించడం ఖాయమని టీమిండియా అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని గూగుల్‌ ఇండియా కూడా విశ్లేషించింది. తాజా ప్రపంచకప్‌లో ఆసీస్‌పై జింబాబ్వే విజయం సాధించిన తర్వాత ఈ విషయం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈసారి కూడా టీమిండియానే టీ20 ప్రపంచ ఛాంపియన్‌ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఈ సెంటిమెంట్‌కు అభిమానులు ప్రస్తుత జట్టు బలాన్ని, ఇటీవలి ఫామ్‌ను కూడా జోడిస్తున్నారు. భారత జట్టు గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉందని, గత రెండేళ్లలో టీమిండియా ఫామ్‌ అద్వితీయంగా ఉందని, పై సెంటిమెంట్‌కు ఈ రెండు కలిస్తే భారత్‌కు తిరుగే ఉండదన్న విషయం స్పష్టమవుతుందని చర్చించుకుంటున్నారు. 

పై ఫ్యాక్టర్స్‌ అన్నీ వర్కౌటై భారత్‌ వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి టీ20 ప్రపంచ ఛాంపియన్‌ కావాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. 

ఇన్ని శుభ శకునాల మధ్య భారతీయులను ఓ చెడు శనుకం కూడా పలకరిస్తుంది. అదేంటంటే.. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ఉండి, మరోసారి ప్రపంచకప్‌ గెలవలేదు. ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌ ఏమైనా వర్కౌటవుతుందేమోనని టీమిండియా ఫ్యాన్స్‌ అందోళన చెందుతున్నారు.  

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)