టీ20 వరల్డ్‌కప్‌-2026 ఛాంపియన్స్‌గా భారత్‌

Published on Sun, 03/08/2026 - 17:11

వరల్డ్‌ ఛాంపియన్‌గా భారత్‌
టీ20 వరల్డ్‌కప్‌-2026 ఛాంపియన్‌గా భారత్‌ నిలిచింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.. మూడోసారి పొట్టి ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. 256 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక కివీస్‌ చతికలపడింది. 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది.

UPDATES
న్యూజిలాండ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 43 పరుగులు చేసిన శాంట్నర్‌.. బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

బుమ్‌ బుమ్‌ బుమ్రా..
16వ ఓవర్‌ వేసిన జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో కివీస్‌ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. మూడో బంతికి నీషమ్‌, నాలుగో బంతికి హెన్రీ క్లీన్‌ బౌల్డయ్యాడు. 16 ఓవర్లకు న్యూజిలాండ్‌ స్కోర్‌: 143/8

ఆరో వికెట్ డౌన్‌.. మిచెల్ ఔట్‌
124 పరుగుల వద్ద కివీస్ ఆరో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన డారిల్ మిచెల్‌.. అక్షర్‌పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

న్యూజిలాండ్‌ ఐదో వికెట్‌ డౌన్‌
52 పరుగులు చేసిన టిమ్‌ సీఫర్ట్‌.. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు కివీస్‌ స్కోర్‌: 80-5

కివీస్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
న్యూజిలాండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 3 పరుగులు చేసిన చాప్‌మన్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

సీఫర్ట్‌ హాఫ్‌ సెంచరీ
ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి టిమ్ సీఫర్ట్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 23 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. 7 ఓవ‌ర్ల‌కు న్యూజిలాండ్‌ 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.

న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ డౌన్‌
న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన గ్లెన్‌ ఫిలిప్స్‌.. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

కివీస్‌ రెండో వికెట్‌ డౌన్‌
రచిన్‌ రవీంద్ర రూపంలో కివీస్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ​​కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన రవీంద్ర.. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

కివీస్‌ తొలి వికెట్‌ డౌన్‌
256 పరుగుల భారీ లక్ష్యంంతో బరిలోకి దిగిన కివీస్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఫిన్‌ అలెన్‌.. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్లకు కివీస్‌ స్కోర్‌: 32/1

న్యూజిలాండ్‌ టార్గెట్‌ ఎంతంటే?
టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న ఫైన‌ల్లో టీమిండియా బ్యాట‌ర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడిన తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగులు చేసింది. 

భారత బ్యాటర్లలో సంజూ శాంసన్‌(46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89), అభిషేక్‌ శర్మ(52), ఇషాన్‌ కిషన్‌(54) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. ఆఖరిలో శివమ్‌ దూబే(8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) మెరుపులు మెరిపించాడు.

18 ఓవర్లలో టీమిండియా స్కోరు: 220-4
హార్దిక్‌ 12, తిలక్‌ 5 పరుగులతో ఉన్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌
15.6: సూర్యకుమార్‌ డకౌట్‌. నీషమ్‌ బౌలింగ్‌లో రచిన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌. స్కోరు: 204-4(16). క్రీజులోకి తిలక్‌ వర్మ. హార్దిక్‌ ఒక పరుగుతో ఉన్నాడు.

మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
15.5: నీషమ్‌ బౌలింగ్‌లో మార్క్‌ చాప్‌మన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన ఇషాన్‌ (25 బంతుల్లో 54).

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌
15.1: జేమ్స్‌ నీషమ్‌ బౌలింగ్‌లో సంజూ మెకాంచీ (సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌)కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 46 బంతుల్లో ఐదు ఫోర్లు, 8 సిక్స్‌లు కొట్టి 89 పరుగులు సాధించాడు.

ఇషాన్‌ హాఫ్‌ సెంచరీ
23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ హాఫ్‌ సెంచరీ

14 ఓవర్లలో టీమిండియా స్కోరు: 191-1
సంజూ 44 బంతుల్లో 88, ఇషాన్‌ కిషన్‌ 19 బంతుల్లో 43 పరుగులతో ఉన్నారు.

శాంసన్‌ హాఫ్‌ సెంచరీ
సంజూ శాంసన్‌ ఫైనల్లోనూ హాఫ్‌ సెంచరీ చేశాడు. 33 బంతుల్లో తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 12 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టానికి 161 పరుగులు చేసింది. 

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
అభిషేక్‌ శర్మ రచిన్‌ రవీంద్ర బౌలింగ్‌లో టిమ్‌ సీఫర్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. గత మ్యాచ్‌లలో విఫలమైన అభిషేక్‌ ఈసారి 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపాడు.

పవర్‌ ప్లేలో టీమిండియా రికార్డు స్కోరు: 92-0(6)
అభిషేక్‌ 19 బంతుల్లో 51, సంజూ శాంసన్‌ 17 బంతుల్లో 33 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

అభిషేక్‌ శర్మ హాఫ్‌ సెంచరీ
కేవలం 18 బంతుల్లోనే అభిషేక్‌ శర్మ అర్ధ శతకం బాదాడు. 

రికార్డు అలర్ట్‌
టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో 50కి పైగా భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్లుగా చరిత్ర సృష్టించిన భారత జోడీ సంజూ- అభిషేక్‌

దూకుడుగా ఆడుతున్న భార‌త ఓపెన‌ర్లు
ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌(23), సంజూ శాంస‌న్‌(24) దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి టీమిండియా వికెట్ న‌ష్ట‌పోకుండా 51 ప‌రుగులు చేసింది.

తుదిజట్లు
భారత్‌
అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్‌
టిమ్ సీఫెర్ట్(వికెట్‌ కీపర్‌), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 తుది అంకానికి చేరుకుంది. అహ్మ‌బాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ పోరులో భార‌త్‌-న్యూజిలాండ్ జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఆదివారం సాయంత్రం 7 గంట‌ల‌కు ఈ హైవోల్టేజ్ మ్యాచ్ షురూ కానుంది. ఇందుకోసం ఇరుజట్లు ఇప్పటికే అహ్మదాబాద్‌ చేరుకున్నాయి. 

ఊర్రూతలూగేలా..
పాప్‌ స్టార్‌ రికీ మార్టిన్‌ క్లోజింగ్‌ సెర్మనీలో మారియా సాంగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. డాన్సులతో ఉర్రూతలూగించాడు. అంతకుముందు సుఖ్‌బీర్‌ తన పాటలతో స్టేడియాన్ని హోరెత్తించాడు.

ధోని సైతం 
అహ్మదాబాద్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియం వ‌ద్ద సంద‌డి వాతావర‌ణం నెల‌కొంది. ఫైన‌ల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు  అభిమానులు పోటెత్తుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సైతం అహ్మ‌దాబాద్‌కు చేరుకున్నారు.

 సతీ సమేతంగా రోహిత్‌
సతీ సమేతంగా భారత మాజీ కెప్టెన్‌, టీ20 ప్రపంచకప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ రోహిత్‌ శర్మ అహ్మదాబాద్‌కు విచ్చేశాడు.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)