T20 WC 2026: అవాంఛిత రికార్డులు మూటగట్టుకున్న అభిషేక్‌ శర్మ

Published on Sun, 02/15/2026 - 20:10

టీ20 ప్రపంచకప్‌ 2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ పలు అవాంఛిత రికార్డులు మూటగట్టుకున్నాడు. పాక్‌తో ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన హైవోల్టేజీ మ్యాచ్‌లో డకౌటైన అతను.. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన మూడో ఆటగాడిగా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. 

గతంలో టీమిండియా మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా, బంగ్లాదేశ్‌ మాజీ ఆటగాడు ఇమ్రుల్‌ కయేస్‌ ఈ అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. నెహ్రా, కయేస్‌ తమ వరల్డ్‌కప్‌ కెరీర్‌లలో ఒక్క పరుగు కూడా చేయకపోవడం మరో విశేషం.

ప్రస్తుత ప్రపంచకప్‌లో యూఎస్‌ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌటైన (తొలి బంతికే) అభిషేక్‌.. ఇవాళ పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు బంతులు ఎదుర్కొని కూడా ఖాతా తెరవలేకపోయాడు. పాక్‌ కెప్టెన్ సల్మాన్ ఆఘా రచించిన వూహ్యంలో చిక్కుకున్న అభిషేక్‌ అవాంఛిత ఈ రికార్డును మూటగట్టుకున్నాడు. అభిషేక్‌కు గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఇది నాలుగో డకౌట్‌ కావడం మరో విశేషం.

కోహ్లి రికార్డు సమం
పాక్‌పై డకౌట్‌ కావడంతో అభిషేక్‌ మరో చెత్త రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌ తరఫున రెండో అత్యధిక డకౌట్లైన ఆటగాడిగా విరాట్‌ కోహ్లి,  గౌతమ్ గంభీర్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే సరసన చేరాడు. వీరంతా మెగా టోర్నీలో తలో రెండు సార్లు డకౌటయ్యారు. ఈ జాబితాలో ఆశిష్‌ నెహ్రా (3) టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు.

సంజూతో సమానంగా..!
తాజా డకౌట్‌తో అభిషేక్‌ మరో అప్రతిష్ట కూడా మూటగట్టుకున్నాడు. టీ20ల్లో భారత ఓపెనర్లలో రెండో అత్యధిక డకౌట్లైన ఆటగాడిగా సంజూ శాంసన్‌ సరసన చేరాడు. అభిషేక్‌, సంజూ తమ టీ20 కెరీర్‌లలో తలో ఐదు సార్లు డకౌటయ్యారు. ఈ జాబితాలో రోహిత్‌ శర్మ (10) అగ్రస్థానంలో ఉన్నాడు.

భారీ స్కోర్‌ దిశగా టీమిండియా
పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. టాస్‌ ఓడి పాక్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న భారత జట్టు తొలి 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (40 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) పాక్‌ బౌలర్లను ఊచకోత కోసి ఔటయ్యాడు. అంతకుముందు అభిషేక్‌ డకౌటయ్యాడు. ప్రస్తుతం సూర్యకుమార్‌ (21), తిలక్‌ వర్మ (25) క్రీజ్‌లో ఉన్నారు. 

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)