Breaking News

IND VS ENG: సెమీస్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు..? రద్దయితే ఫైనల్‌కు టీమిండియా

Published on Thu, 11/10/2022 - 09:51

టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య అడిలైడ్‌ వేదికగా ఇవాళ (నవంబర్‌ 10) రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. మధ్యాహ్నం 1: 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ కోసం యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు వర్షం ముంపు పొంచి ఉందని స్థానిక వాతావరణ శాఖ అలర్ట్‌ జారీ చేసిం‍ది.

అడిలైడ్‌, పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి వర్షం కురిసిందని, ఇవాళ ఉదయం కూడా ఉరుములు, మెరుపులతో 40 శాతం మేరకు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని అడిలైడ్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వార్త తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ అభిమానులకు ఈ వార్త అస్సలు సహించడం లేదు.

ఎందుకంటే.. ఒక వేళ వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్‌ రద్దైతే, రిజ్వర్‌ డేలో మ్యాచ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ అప్పుడు కూడా సాధ్యపడకపోతే.. గ్రూప్‌ దశలో టాపర్‌గా ఉన్న జట్టును (భారత్‌) విజేతగా ప్రకటిస్తారు. ఇప్పుడు ఇదే అంశం ఇంగ్లండ్‌ జట్టును, ఆ దేశ అభిమానులను కలవరపెడుతుంది. 

ఇదిలా ఉంటే, నిన్న జరిగిన తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌.. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఒకవేళ వర్షం పడకుండా ఇవాల్టి మ్యాచ్‌ సజావుగా సాగితే.. ఈ మ్యాచ్‌ విజేత నవంబర్‌ 13న పాకిస్తాన్‌తో టైటిల్‌ పోరులో తలపడనుం‍ది. 

Videos

ఇటలీ ప్రధానికి ఊహించని స్వాగతం.. మోకాళ్లపై కూర్చొని..!

అధికారం ఇచ్చింది ఇందుకేనా? అఖిలప్రియపై YSRCP నేత ఫైర్

గోవిందప్పతో పోలీసుల బలవంతపు సంతకాలు

చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది

బంధాలు వద్దు..డబ్బు ముద్దు

కడపలో పట్టుబడ్డ ఆఫ్గనిస్తాన్ సిటిజన్స్

పాకిస్థాన్ తో దౌత్య యుద్ధానికి భారత్ సిద్ధం

పాకిస్థాన్ తో దౌత్య యుద్ధానికి భారత్ సిద్ధం

Varudu Kalyan: లిక్కర్ స్కాం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వమే

IAS, IPSల అరెస్టులు సరికావు.. అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి

Photos

+5

#MissWorld2025 : పిల్లలమర్రిలో అందగత్తెల సందడి (ఫొటోలు)

+5

ముంబై వాంఖడేలో రో‘హిట్‌’ శర్మ స్టాండ్‌.. ఆనందంలో ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

శ్రీవిష్ణు ‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అందాల భామలు (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌: 13 ఏళ్లకే హీరోయిన్.. ఛార్మి జీవితాన్ని మార్చేసిన సినిమా ఏదంటే?

+5

ఈ తప్పులు చేస్తే EPF క్లెయిమ్‌ రిజెక్టే.. (ఫొటోలు)

+5

Miss World 2025 : ఎకో పార్క్ కు ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)

+5

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' హీరో క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

Subham Success Meet : శుభం సక్సెస్ మీట్ (ఫొటోలు)