Breaking News

మరో రసవత్తర సమరం.. సెమీస్‌కు ఇంగ్లండ్‌.. ఆస్ట్రేలియాకు శృంగభంగం

Published on Sat, 11/05/2022 - 17:03

టీ20 వరల్డ్‌కప్‌-2022లో గ్రూప్‌-1 సెమీస్‌ బెర్తులు ఖరారయ్యాయి. ఈ గ్రూప్‌ నుంచి న్యూజిలాండ్‌ తొలి జట్టుగా సెమీస్‌కు చేరుకోగా.. ఇవాళ (నవంబర్‌ 5) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై గెలుపుతో ఇంగ్లండ్‌ రెండో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించింది. ఫలితంగా సెమీస్‌పై గంపెడాశలు పెట్టుకున్న ఆతిధ్య ఆస్ట్రేలియాకు శృంగభంగం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిస్తే సెమీస్‌కు చేరాలని భావించిన ఆసీస్‌.. ఇంగ్లండ్‌ గెలవడంతో సూపర్‌-12 దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.   

కాగా, ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక (45 బంతుల్లో 67; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగుల నామమాత్రపు స్కోర్‌ చేసింది. లంక ఇన్నింగ్స్‌లో నిస్సంకతో పాటు కుశాల్‌ మెండిస్‌ (18), భానుక రాజపక్ష (22) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌, సామ్‌ కర్రన్‌, ఆదిల్‌ రషీద్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం నామమాత్రమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ (23 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్‌), అలెక్స్‌ హేల్స్‌ (30 బంతుల్లో 47; 7 ఫోర్లు, సిక్స్‌) ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఓ దశలో ఓటమి దిశగా కూడా సాగింది. అయితే బెన్‌  స్టోక్స్‌ (36 బంతుల్లో 42 నాటౌట్‌; 2 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు.

ఇంగ్లండ్‌.. 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి, 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓడినా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఇంగ్లండ్‌ను దాదాపుగా ఓడించినంత పని చేసింది. లంక బౌలర్లలో లహీరు కుమార, వనిందు హసరంగ, ధనంజయ డిసిల్వా చెరో 2 వికెట్లు పడగొట్టారు. 
 

Videos

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

Photos

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)