Breaking News

Ind Vs Eng: టీమిండియా ఓటమి.. ఫైనల్‌కు చేరుకున్న ఇంగ్లండ్‌

Published on Thu, 11/10/2022 - 16:32

ICC Mens T20 World Cup 2022- India vs England, 2nd Semi-Finalటీ20 ప్రపంచకప్‌-2022 ఫైనల్లో టీమిండియాను చూడాలనుకున్న అభిమానుల ఆశ నెరవేరలేదు. రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడ్డ రోహిత్‌ సేన 10 వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అడిలైడ్‌ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఫర్వాలేదనిపించినా.. బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇంగ్లండ్‌ ఓపెనర్లు తమ జట్టుకు విజయం అందించారు. 

ఆదిలోనే ఎదురుదెబ్బ
టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మొదటి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(5) పూర్తిగా నిరాశపరిచాడు. ఇన్నింగ్స్‌ నాలుగో బంతికే అతడు అవుటయ్యాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, మరో ఓపెనర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఆచితూచి ఆడగా.. పవర్‌ ప్లేలో భారత జట్టు వికెట్‌ నష్టానికి 38 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

ఆచితూచి.. అతి జాగ్రత్తగా
ఇక ఇక 28 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ శర్మ 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కోహ్లి 40 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. మిడిలార్డర్‌ స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 14 పరుగులు మాత్రమే చేసి అవుట్‌కాగా.. ఐదో స్థానంలో బరిలోకి దిగిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దాటిగా ఆడాడు.

33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అతడు 63 పరుగులు సాధించాడు. ఇక వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌(6) రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయిన టీమిండియా 168 పరుగులు చేసింది.

ఇద్దరే గెలిపించారు
లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జోస్‌ బట్లర్‌, అలెక్స్‌ హేల్స్‌ అదిరిపోయే ఆరంభం అందించారు. భారత బౌలర్లు ఏ దశలోనూ ఈ జంటను విడగొట్టలేకపోయారు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఏ బౌలర్‌ను బరిలోకి దింపినా ఫలితం లేకుండా పోయింది. హేల్స్‌ 86, బట్లర్‌ 80 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఇలా భారత్‌ను ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడించిన బట్లర్‌ బృందం ఫైనల్‌కు చేరుకుంది. కాగా నవంబరు 13 నాటి ఫైనల్లో ఇంగ్లండ్‌.. పాకిస్తాన్‌తో తలపడనుంది.

మ్యాచ్‌ స్కోర్లు:
భారత్‌: 168/6 (20)
ఇంగ్లండ్‌: 170/0 (16)
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అలెక్స్‌ హేల్స్‌

చదవండి: T20 WC 2022 IND Vs ENG: ఏంటి రాహుల్‌ నీ ఆట? వెంటనే జట్టు నుంచి తీసేయండి అంటూ!

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)