Breaking News

T20 WC 1st Semi Final: టాస్‌ గెలిచిన కివీస్‌.. తుదిజట్లు ఇవే

Published on Wed, 03/04/2026 - 18:34

పొట్టి క్రికెట్‌ మహా సంగ్రామంలో తొలి సెమీ ఫైనల్‌ పోరుకు తెరలేచింది. టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌ మధ్య జరిగే ఈ మెగా మ్యాచ్‌కు కోల్‌కతా వేదిక. ఈడెన్‌ గార్డెన్స్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుని.. ప్రొటిస్‌ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

టాస్‌ సందర్భంగా కివీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ మాట్లాడుతూ.. ‘‘పిచ్‌ బాగుంది. వికెట్‌ పాతబడే కొద్ది బ్యాటింగ్‌కు ఇంకాస్త సహకరిస్తుందని అనిపిస్తోంది. అందుకే తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాం. ఆది నుంచే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాల్సి ఉంటుంది. మ్యాట్‌ హెన్రీ తిరిగిఇ వచ్చాడు. సోధి స్థానంలో నీషమ్‌ కూడా తుదిజట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.

మా తుదిజట్టులో మూడు మార్పులు
ఇక సౌతాఫ్రికా సారథి ఐడెన్‌ మార్క్రమ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీలో ఇప్పటి వరకు మా జట్టులోని ప్రతి సభ్యుడు తమ వంతు సహకారం అందించడం సంతోషకరం. ఈ మ్యాచ్‌లోనూ గొప్పగా రాణించి మంచి స్కోరు నమోదు చేస్తామని ఆశిస్తున్నా. గత రాత్రి కూడా మేము ప్రాక్టీస్‌ చేశాము.

మా తుదిజట్టులో మూడు మార్పులు చేశాము. రబడ, యాన్సెన్‌, కేశవ్‌ మహరాజ్‌ తిరిగి జట్టులోకి వచ్చారు’’ అని పేర్కొన్నాడు. కాగా సూపర్‌-8 దశలో అజేయంగా నిలిచిన సౌతాఫ్రికా తొలి టైటిల్‌ వేట దిశగా సెమీస్‌ రూపంలో మరో ముందడుగు వేసింది. గత ఎడిషన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సఫారీలు ఈసారి పట్టు వదలకుండా పోరాడేందుకు సిద్ధమయ్యారు

నిలకడైన ఆట.. ప్రొటిస్‌దే పైచేయి
మరోవైపు.. సౌతాఫ్రికా మాదిరే ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవని న్యూజిలాండ్‌ సైతం ఈసారి ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే, ఈ ఎడిషన్లో ప్రదర్శనల పరంగా కివీస్‌ కంటే సఫారీలే ఓ అడుగు ముందున్నారు. 

ఇక సూపర్‌-8 దశలో పాకిస్తాన్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ రద్దు కాగా.. శ్రీలంకపై గెలిచిన న్యూజిలాండ్‌ సెమీస్‌ రేసులో ముందుకు దూసుకువచ్చింది. ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడినా.. పాక్‌ శ్రీలంకపై నామమాత్రపు విజయంతో సరిపెట్టుకోవడంతో సెమీ ఫైనల్లో అడుగుపెట్టగలిగింది.

తుదిజట్లు ఇవే
న్యూజిలాండ్‌
టిమ్ సీఫెర్ట్(వికెట్‌ కీపర్‌), ఫిన్ అలెన్‌, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్‌, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), కోల్ మెక్‌కాంచీ, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్

సౌతాఫ్రికా
ఐడెన్ మార్క్రమ్‌ (కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి.

చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్‌ బోర్డులో తొలి రాజీనామా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)