Breaking News

‘అడాలజ్‌ స్టెప్‌వెల్‌’ చరిత్ర తెలుసా?

Published on Tue, 03/10/2026 - 14:15

అహ్మదాబాద్‌: ప్రపంచకప్‌తో భారత టి20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ గాంధీనగర్‌ సమీపంలోని మోనుమెంట్‌ కాంప్లెక్స్‌కు చేరగానే అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. గుజరాత్‌ వారసత్వ కట్టడం ‘అడాలజ్‌ స్టెప్‌వెల్‌’ వద్ద అధికారిక ఫొటో సెషన్‌ నిర్వహించగా.. టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ ప్రపంచకప్‌తో సందడి చేశాడు. అతను కప్‌తో చేరుకోగానే అభిమానులంతా ‘ఇండియా... ఇండియా...’ నినాదాలతో హోరెత్తించారు. తర్వాత అడాలజ్‌ కట్టడం వద్ద కప్‌ పట్టుకొని ఫొటోలకు ఫొజులివ్వడంతో కెమెరా ట్రిగ్గర్లన్నీ ‘కిస్సిక్‌... కిస్సిక్‌...’ మోత మోగాయి.

సుప్రసిద్ధ ‘అడాలజ్‌ స్టెప్‌వెల్‌’ (Adalaj Stepwell) 500 ఏళ్ల పైచిలుకు చరిత్ర ఉంది. రాణి రుడాబాయి ఈ అడాలజ్‌ను నిర్మించింది. ఆమె వాఘెలా సంస్థానధీశుడు రాణా వీర్‌ సింగ్‌ భార్య. రాణా వీర్‌ మరణానంతరం రుడాబాయి ఈ ప్రాంతాన్ని పాలించింది. ఆ సమయంలోనే అడాలజ్‌ స్టెప్‌వెల్‌ను నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. గుజరాత్‌ సంస్కృతి, వారసత్వ సంపదలో భాగమైన ఈ కట్టడాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ సందర్భంగా విన్నర్స్‌ ట్రోఫీతో భారత జట్టు అప్పటి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఆ్రస్టేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఫొటోలు దిగారు.

  

ట్రోఫీతో ఆలయంలో పూజలు 
అంతకుముందు స్టేడియంలో సంబరాల్లో పాల్గొన్న ఆటగాళ్లు కాసేపు సేద తీరారు. ఈ సమయంలో కోచ్‌ గంభీర్, కెప్టెన్‌ సూర్యకుమార్, ఐసీసీ చైర్మన్‌ జై షాతో కలిసి స్టేడియం లోపలే ఉన్న హనుమాన్‌ ఆలయానికి ప్రపంచకప్‌ను తీసుకువెళ్లి పూజలు చేశారు. పూజల అనంతరం మళ్లీ ఎప్పట్లాగే మైదానంలోకి వచ్చి అభిమానుల్ని అలరించారు. సోమవారం తెల్లవారుజాము వరకు ఈ సంబరాలు జరుపుకున్నారు. తిలక్‌ వర్మ, అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్, వరుణ్‌ చక్రవర్తి తదితరులు ప్రపంచకప్‌తో దిగిన ఫొటోలను తమ సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)