Breaking News

సూర్యకుమార్ యాదవ్‌పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు

Published on Tue, 12/30/2025 - 15:36

భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పై బాలీవుడ్‌ నటి  ఖుషి ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో సూర్యకుమార్ యాదవ్‌ తనకు తరచూ మెసేజ్‌లు చేసేవాడని బాంబు పేల్చింది. ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి సంభాషణ జరగడం లేదని తెలిపింది.

ఓ ఈవెంట్‌ సందర్భంగా ఎవరైనా క్రికెటర్‌తో డేటింగ్‌ చేయాలనుకుంటున్నారా అని రిపోర్టర్‌ అడగగా ఖుషి ఇలా బదులిచ్చింది. "నేను ఎలాంటి క్రికెటర్‌తో డేట్ చేయాలనుకోవడం లేదు. చాలా మంది క్రికెటర్లు నన్ను ఫాలో అవుతున్నారు. గతంలో సూర్యకుమార్ యాదవ్ తురుచూ మెసేజ్‌లు చేసేవాడు. ఇప్పుడు మేము మాట్లాడుకోవడం లేదు. నాకు లింక్ అప్స్ అస్సలు నచ్చవు" అని స్పషం చేసింది.  

సూర్యకుమార్‌ యాదవ్‌ గురించి ఖుషి బయటపెట్టిన ఈ సంచలన విషయాలు ప్రస్తుతం  క్రికెట్‌ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి. తరుచూ భార్యతో కలిసి దైవ దర్శనాలకు వెళ్లే సూర్యకుమార్‌ యాదవ్‌లో ఈ యాంగిల్‌ కూడా ఉందా అంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.

ఇవాళే సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవీషా శెట్టితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి పూజలు చేశాడు. స్కై సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్న ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుండగానే, ఖుషి వ్యాఖ్యలు బయటికి రావడం​ ఆసక్తికరంగా మారింది.

కోల్‌కతాలో జన్మించిన ఖుషి ఎంటీవీలో ప్రసారమయ్యే Splitsvilla రియాలిటీ షో ద్వారా బాగా పాపులరైంది. మోడల్‌ కూడా అయిన ఖుషి బాలీవుడ్‌ సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. నితిన్‌తో కలిసి హార్ట్‌ అటాక్‌.. ఆకాశ్‌తో కలిసి దొంగ ప్రేమ తదితర సినిమాల్లో లీడ్‌ రోల్‌లో యాక్ట్‌ చేసింది.

సూర్యకుమార్‌ యాదవ్‌ విషయానికొస్తే.. అతని సారథ్యంలో భారత టీ20 జట్టు ఇటీవలే స్వదేశంలో దక్షిణాఫ్రికాపై 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 3-1 తేడాతో విజయం​ సాధించింది. త్వరలో స్కై నేతృత్వంలోని టీమిండియా స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. 

వచ్చే ఏడాది జరుగబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు సూర్యకుమారే సారథ్యం వహించనున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్‌ సిరీస్‌, టీ20 వరల్డ్‌కప్‌ల కోసం​ టీమిండియాను ప్రకటించారు. పొట్టి ఫార్మాట్‌లో టీమిండియాను తిరుగులేని జట్టుగా నడిపిస్తున్న సూర్యకుమార్‌.. వ్యక్తిగతంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)