జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్
Breaking News
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్?
Published on Tue, 06/17/2025 - 19:19
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. అయితే ఈ పర్యటనకు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యే అవకాశముంది.
సూర్యకుమార్ యాదద్ మరో శస్త్రచికిత్స లండన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. న్యూస్24 రిపోర్టర్ వైభవ్ భోలా ప్రకారం.. సూర్యకుమార్ కుడివైపున స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సూర్య తన గాయానికి శస్త్రచికిత్స చేసుకోవడానికి ఇప్పటికే లండన్‌కు వెళ్లినట్లు వైభవ్ భోలా ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
కాగా ఈ ముంబై ఆటగాడు స్పోర్ట్స్ హెర్నియా బారిన పడడం ఇది రెండో సారి. గతేడాది జనవరిలో ఎడమ వైపున నొప్పి రావడంతో జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలోనే స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. కానీ ఫిట్‌నెస్ సాధించి ఐపీఎల్‌తో పాటు, టీ20 ప్రపంచకప్-2024లో భాగమయ్యాడు.
ఇప్పుడు కుడివైపు నొప్పి రావడంతో మళ్లీ శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. ఒకవేళ ఇదే నిజమైతే మిస్టర్ 360 దాదాపు రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. బంగ్లా టూర్‌కు సూర్య సూర్యదూరమైతే భారత జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించే అవకాశముంది. ఐపీఎల్-2025లో అద్బుత ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన అయ్యర్.. తిరిగి టీ20 జట్టులోకి రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు.
చదవండి: ICC Odi Rankings: వరల్డ్ నెం1 బ్యాటర్‌గా టీమిండియా స్టార్ ఓపెనర్
Tags : 1