'గౌతీతో నా బంధం చాలా స్పెషల్‌.. అదే నా కెరీర్ టర్నింగ్ పాయింట్‌'

Published on Fri, 07/26/2024 - 15:25

టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్య‌కుమార్ యాద‌వ్‌, నూతన హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ త‌మ ప్ర‌య‌ణాన్ని ప్రారంభించేందుకు సిద్ద‌మ‌య్యారు. జూలై 27న ప‌ల్లెకెలె వేదిక‌గా శ్రీలంక‌తో జ‌ర‌గ‌నున్న తొలి టీ20తో వీరిద్ద‌రి ప్ర‌స్ధానం మొద‌లు కానుంది.

రోహిత్ శ‌ర్మ స్ధానంలో భార‌త టీ20 కెప్టెన్‌గా సూర్య బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గా.. రాహుల్ ద్ర‌విడ్ వారసుడిగా గంభీర్ ఎంపిక‌య్యాడు. ఈ నేప‌థ్యంలో కొత్త హెడ్‌కోచ్ గంభీర్‌ను ఉద్దేశించి సూర్య‌కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.  గౌతమ్ గంభీర్‌తో కలిసి ప‌నిచేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు సూర్య తెలిపాడు.

"గౌతం గంభీర్‌తో నా బంధం చాలా ప్రత్యేకం. ఎందుకంటే నా ఐపీఎల్‌ అరంగేట్రంలో కేకేఆర్ తరపున గంభీర్ కెప్టెన్సీలోనే ఆడాను. కేకేఆర్ ఫ్రాంచైజీలో నాకు ఆడే అవకాశం రావడం నిజంగా చాలా గొప్పవిషయం. అక్కడ నుంచే నా కెరీర్ మలుపు తిరిగింది. 

ఆ తర్వాత జాతీయ జట్టులో ఆడే అవకాశం నాకు లభించింది. మా మధ్య ఆ బంధం ఇప్పటికీ బలంగా ఉంది. నా మైండ్‌సెట్‌, పనితీరు ఎలా ఉంటుందో గంభీర్‌కు బాగా తెలుసు. అతడు కోచ్‌గా ఎలా పనిచేస్తాడో నాకు కూడా తెలుసు.

గంభీర్ లాంటి వ్యక్తితో కలిసి పనిచేసే అవకాశం​ రావడం నా అదృష్టం​. మా మా ఇద్దరి  కాంబినేషన్‌లో అన్ని మంచి ఫలితాలే రావాలని ఆశిస్తున్నట్లు" బీసీసీఐ టీవీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్ పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌లో భారత్‌ ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)