Breaking News

చరిత్ర సృష్టించిన సూర్యకుమార్‌.. విరాట్‌ కోహ్లి రికార్డు బద్దలు

Published on Sun, 02/08/2026 - 15:09

భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చరిత్ర సృష్టించాడు. నిన్న (ఫిబ్రవరి 7) యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికైన అతను.. భారత టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా విరాట్‌ కోహ్లి రికార్డు బద్దలు కొట్టాడు. విరాట్‌ 125 మ్యాచ్‌ల్లో 16 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలిస్తే.. స్కై కేవలం​ 105 మ్యాచ్‌ల్లోనే 17 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలిచాడు. 

ఈ జాబితాలో స్కై, విరాట్‌ తర్వాతి స్థానంలో రోహిత్‌ శర్మ (159 మ్యాచ్‌ల్లో 14) ఉన్నాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలిచిన ఘనత మలేషియాకు చెందిన విరన్‌దీప్‌ సింగ్‌కు (22) దక్కుతుంది. విరన్‌దీప్‌ తర్వాతి స్థానాల్లో సికందర్‌ రజా (19), సూర్యకుమార్‌ (17) ఉన్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 84 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

స్కై మినహా భారత ఇన్నింగ్స్‌లో మిగతా వారంతా విఫలమయ్యారు. తిలక్‌ వర్మ (25), ఇషాన్‌ కిషన్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అభిషేక్‌ శర్మ, శివమ్‌ దూబే, వరుణ్‌ చక్రవర్తి డకౌట్లు అయ్యారు. రింకూ సింగ్‌ 6, హార్దిక్‌ పాండ్యా 5,అక్షర్‌ పటేల్‌ 14చ, అర్షదీప్‌ సింగ్‌ 4 పరుగులు చేశారు. యూఎస్‌ఏ బౌలర్లలో వాన్‌ స్కాల్విక్‌ 4, హర్మీత్‌ సింగ్‌ 2, మొహమ్మద్‌ మొహిసిన్‌, అలీ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం 162 పరుగుల లక్ష్య ఛేదనలో యూఎస్‌ఏ తడబడింది. సిరాజ్‌ (4-0-29-3), అర్షదీప్‌ సింగ్‌ (4-0-18-2), అక్షర్‌ పటేల్‌ (4-0-24-2), వరుణ్‌ చక్రవర్తి (4-0-24-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో సంజయ్‌ కృష్ణమూర్తి, శుభమ్‌ రంజనే తలో 37 పరుగులు చేసి టాప్‌ స్కోరర్లుగా నిలవగా.. మిలింద్‌ కుమార్‌ 34 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో అండ్రియస్‌ గౌస్‌ 6, సాయితేజ ముక్కామల 2, మొహిసిన్‌ ఖాన్‌ 8, స్కాల్విక్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేయగా.. మోనాంక్‌ పటేల్‌, హర్మీత్‌ సింగ్‌ డకౌట్లయ్యారు. 
 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)