Breaking News

నా కెరీర్‌లో ఇలా ఎప్పుడు జ‌ర‌గలేదు.. కానీ చాలా సంతోషంగా ఉంది: సూర్య

Published on Mon, 09/29/2025 - 10:54

ఆసియాక‌ప్-2025కు ఆదివారం(సెప్టెంబ‌ర్ 28) ఎండ్ కార్డ్ ప‌డింది. దుబాయ్ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించిన భార‌త జ‌ట్టు.. రికార్డు స్ధాయిలో తొమ్మిదోసారి ఆసియాకప్ విజేత‌గా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ అనంత‌రం దుబాయ్ అంత‌ర్జాతీయ మైదానంలో అనుహ్య‌ప‌రిణామాలు చోటు  చేసుకున్నాయి.

ఈ టోర్నీ ఆరంభం నుంచే పాక్‌తో అంటి ముట్ట‌కుండా ఉంటున్న భార‌త జ‌ట్టు.. ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ అదే తీరును కొన‌సాగించింది. అయితే ఈసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మెన్‌, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీకి టీమిండియా ఝుల‌క్ ఇచ్చింది.

అత‌డి చేతుల మీద‌గా విన్నింగ్ ట్రోఫీని తీసుకోవ‌డానికి భార‌త ఆట‌గాళ్లు నిరాక‌రించారు. మొహ్సిన్ నఖ్వీ ప్ర‌స్తుతం పీసీబీ చైర్మెన్‌తో పాటు పాకిస్తాన్ మంత్రిగా కొన‌సాగుతున్నాడు. ఈ కార‌ణంతోనే అత‌డి చేతుల మీద‌గా ట్రోఫీని తీసుకోవ‌డానికి టీమిండియా స‌ముఖ‌త చూపలేదు.  దీంతో గ్రౌండ్‌కు తీసుకొచ్చిన ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లారు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సంబ‌రాలు చేసుకున్నారు.

 ఇదే విష‌యంపై పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో భార‌త కెప్టెన్ సూర్యకుమార్ యాద‌వ్ స్పందించాడు. త‌న కెరీర్‌లో ఫైన‌ల్ మ్యాచ్‌ గెలిచిన త‌ర్వాత ట్రోఫీ తీసుకోపోవ‌డం ఇదే తొలిసారి సూర్య చెప్పుకొచ్చాడు.

"నా క్రికెట్‌లో కెరీర్‌లో ఇలాంటి సంఘ‌ట‌న‌ను ఇప్ప‌టివ‌రకు చూడ‌లేదు. ఓ జ‌ట్టు ఛాంపియ‌న్స్‌గా త‌ర్వాత ట్రోఫీని అందుకోకపోవడం ఇదే మొద‌టి సారి. మేము క‌ష్ట‌ప‌డి ఛాంపియ‌న్‌గా నిలిచిన‌ప్ప‌టికి, ట్రోఫీని తిరస్కరించాల‌ని నిర్ణ‌యించుకున్నాము. మేము ఈ నెల 4వ తేదీ నుంచి ఇక్క‌డే(దుబాయ్‌) ఉన్నాము. 

ప్ర‌తీ మ్యాచ్‌లోనూ వంద శాతం ఎఫక్ట్ పెట్టి విజ‌యం సాధించాము. ఒక్క రోజు వ్య‌వ‌ధిలో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌లు ఆడి టైటిల్‌ను సొంతం చేసుకున్నాము. ఇందుకు మేము అన్ని ర‌కాల‌గా అర్హులు. ఇంత‌కుమించి నేను చెప్ప‌లేను. ట్రోఫీల గురించి మాట్లాడితే.. 14 మంది స‌హ‌చ‌రులు, సహాయక సిబ్బంది రూపంలో నా డ్రెసింగ్ రూమ్‌లో ఉన్నాయి. 

నా దృష్టిలో వారే నిజమైన ట్రోఫీలు. ఈ ఆసియా కప్ ప్రయాణంలో సపోర్ట్‌ స్టాప్ మాకు అన్ని విధాలగా అండగా నిలిచారు. మా కుర్రాళ్లు కూడా టోర్నీ అంతటా అద్బుతంగా రాణించారు. ఫైనల్ మ్యాచ్‌లో గెలవాలనకున్నాము. మేము అనుకున్నట్లు గెలిచాం. 

మ్యాచ్ ముగిసిన తర్వాత బిగ్ స్క్రీన్‌పై భారత్ గెలిచినట్లు, ఆసియా కప్ 2025 ఛాంపియన్స్ అని రాసి ఉంది. అంతకంటే మా​కు ఇంకేమి కావాలి. చాలా సంతోషంగా ఉంది అని" సూర్య పేర్కొన్నాడు. అయితే  హ్యాండ్ షేక్‌ వివాదం, ట్రోఫీ తీసుకోకపోవడానికి కారణాలపై పాక్‌ జర్నలిస్టు అడిగిన సమాధానాలను సూర్య దాటవేశాడు. 
చదవండి: అదే మా కొంప‌ముంచింది.. లేదంటే క‌థ మ‌రోలా ఉండేది: పాక్‌ కెప్టెన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)