Breaking News

ఐసీసీ ట్రోఫీ దాకా ఎందుకు.. కోహ్లి ఇంకా ఐపీఎల్‌ కప్‌ కూడా గెలవలేదు!

Published on Mon, 07/12/2021 - 12:48

న్యూఢిల్లీ: క్రికెట్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు సృష్టించి పరుగుల యంత్రంగా గుర్తింపు పొందాడు. అటు కెప్టెన్‌గానూ కోహ్లికి మంచి రికార్డే ఉన్నా... ఇంతవరకు ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా సాధించలేకపోయాడనే లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. టెస్టు క్రికెట్‌లో భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందించిన కోహ్లి సారథ్యంలోని జట్టు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంటుందని అభిమానులు భావించినా చివరకు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో కోహ్లి కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ కామెంట్లు వినిపించాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి గొప్ప కెప్టెన్‌ అని, ఐసీసీ ట్రోఫీ గెలిచేందుకు ఇంకాస్త సమయం పడుతుందన్నాడు. ‘‘సారథిగా తన సత్తా ఏంటో రికార్డులే చెబుతాయి. నాకు తెలిసి ఈ ప్రపంచంలో తనే నెంబర్‌ 1 బ్యాట్స్‌మెన్‌. చాలా మంది ఐసీసీ టైటిల్‌ గురించి మాట్లాడుతున్నారు.. కానీ అతడు ఇంతవరకు ఐపీఎల్‌ ట్రోఫీ కూడా గెలవలేదు. నిజం చెప్పాలంటే.. వెనువెంటనే కోహ్లి సేన మూడు మేజర్‌ టోర్నీలు ఆడింది. ఫైనల్‌ చేరింది. కానీ తుదిపోరులో తృటిలో విజయం చేజారింది. 

అయినా, ప్రతిసారీ ఇలా ఫైనల్‌ వరకు చేరడం అంత సులభమేమీ కాదు. కోహ్లికి ఇంకాస్త సమయం ఇవ్వాలి’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక కొంతమంది నెటిజన్లు టీమిండియాను చోకర్స్‌ అని పిలవడం పట్ల స్పందిస్తూ.. ‘‘మేం చోకర్స్‌ కాదు. 1983 వన్డే వరల్డ్‌ కప్‌, 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచాం. ప్రతీ విజయం వెనుక ఆటగాళ్ల కఠిన శ్రమ ఉంటుంది. చోకర్స్‌ అని పిలవడం సరికాదు’’ అని రైనా పేర్కొన్నాడు. ఇక 2014లో టెస్టు, 2017లో పరిమిత ఓవర్ల క్రికెట్‌ పగ్గాలను కోహ్లి చేపట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు... ఇంతవరకు ఒక్కసారి టైటిల్‌ సాధించలేకపోయాడు.

Videos

భారత్‌కు షాక్ మీద షాక్ ఇస్తున్న ట్రంప్

వ్యాపారులను బెదిరిస్తూ వసూళ్ల పర్వానికి తెరలేపిన పచ్చ నేతలు

జమ్మూలో మళ్లీ మొదలైన ఉగ్రవేట ఉగ్రవాదులను పట్టించిన డ్రోన్

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఏపీలో రాక్షస పాలన సాగుతోంది: మాజీ MLA రవీంద్రనాథ్ రెడ్డి

మంత్రి వ్యాఖ్యలపై FIR నమోదుకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశం

మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గేర్ హార్డ్ తో సాక్షి ఎక్స్ క్లూజివ్

భారత్ కు వ్యతిరేకంగా ఒక్కటైన దుష్ట కూటమి

గుంటూరులోని విద్యా భవన్ ను ముట్టడించిన ఉపాధ్యాయ సంఘాలు

తిరుపతి రుయాలో అనిల్ ను పరామర్శించిన భూమన కరుణాకర్ రెడ్డి

Photos

+5

డ్యాన్సింగ్‌ క్వీన్‌ 'మాధురీ దీక్షిత్‌' బర్త్‌డే.. ఈ విషయాలు తెలుసా?

+5

నిఖిల్‌ సిద్ధార్థ్ పెళ్లికి ఐదేళ్లు.. భార్యకు స్పెషల్ విషెస్ (ఫొటోలు)

+5

తెలంగాణ : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం (ఫొటోలు)

+5

అనంతపురంలో కుండపోత వర్షం.. వరద నీటిలో ప్రజల ఇక్కట్లు (ఫొటోలు)

+5

#MissWorld2025 : బతుకమ్మలతో ముద్దుగుమ్మలకు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)

+5

ఈ తీపి గుర్తులు మరిచిపోలేను‌.. ఫోటోలు విడుదల చేసిన శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

జాతరలో నిర్లక్ష్యం గంగమ్మ జాతరకు భారీగా భక్తులు..(ఫొటోలు)

+5

వరంగల్‌ : కాకతీయ వైభవాన్ని చూసి మురిసిన విదేశీ వనితలు (ఫొటోలు)

+5

Miss World2025: రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు

+5

Cannes Film Festival 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన అందాల తారలు.. ఫోటోలు