నరైన్‌@600.. లివింగ్‌స్టోన్‌ ధన్‌ ధనాధన్‌

Published on Thu, 12/04/2025 - 07:30

విండీస్‌ టీ20 స్పెషలిస్ట్‌, స్పిన్‌ మాంత్రికుడు సునీల్‌ నరైన్‌ (Sunil Narine) పొట్టి క్రికెట్‌లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. 

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో భాగంగా అబుదాబీ నైట్‌రైడర్స్‌కు సారథ్యం వహిస్తున్న అతను.. నిన్న (డిసెంబర్‌ 3) షార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ వికెట్‌ (టామ్‌ ఏబెల్‌) తీశాడు. 

ఇదేం మైలురాయి అనుకుంటున్నారా..? ఆగండి. ఈ వికెట్‌ నరైన్‌కు టీ20 క్రికెట్‌లో 600వది. ఈ ఫార్మాట్‌ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు (నరైన్‌తో కలుపుకొని) మాత్రమే ఈ ఘనత సాధించారు. నరైన్‌కు ముందు డ్వేన్‌ బ్రావో (631), రషీద్‌ ఖాన్‌ (681) 600 వికెట్ల క్లబ్‌లో చేరారు.

లివింగ్‌స్టోన్‌ ఊచకోత
షార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ ఆటగాడు లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (Liam Livingstone) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 

కేవలం 38 బంతుల్లో 8 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 82 పరుగులు చేశాడు. అతనితో పాటు అలెక్స్‌ హేల్స్‌ (32), షరాఫు (34), రూథర్‌ఫోర్డ్‌ (45) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వారియర్స్‌ చేతులెత్తేసింది. టిమ్‌ డేవిడ్‌ (24 బంతుల్లో 60; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) ఒక్కడే పోరాడినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 194 పరుగులకే పరిమితమై 39 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. సునీల్‌ నరైన్‌ పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు ఓ వికెట్‌ తీసి 600 వికెట్ల క్లబ్‌లో చేరాడు. 
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)