Breaking News

'ఇదేమి బ్యాటింగ్‌'.. సంజూపై గవాస్కర్‌ ఫైర్‌

Published on Thu, 01/29/2026 - 11:26

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026కు ముందు భార‌త‌ స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ పేల‌వ ఫామ్ టీమ్ మెనెజ్‌మెంట్‌కు త‌ల‌నొప్పిగా మారింది. ఈ మెగా టోర్నీ సన్నాహాల్లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో శాంసన్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.

తొలి మూడు టీ20ల్లో విఫలమైన సంజూ.. బుధవారం వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లోనూ నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యాడు. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ నేపథ్యంలో శాంసన్ ఔట్ అయిన తీరుపై  సునీల్ గవాస్కర్ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు.

'శాంట్న‌ర్ బౌలింగ్‌లో సంజూ అనవ‌స‌రంగా వికెట్ స‌మ‌ర్పించుకున్నాడు. అత‌డి బ్యాటింగ్‌లో ఫుట్ వ‌ర్క్ అస్స‌లు లేదు.  బంతి పెద్దగా టర్న్ అవ్వకపోయినా, కేవలం రూమ్ క‌ల్పించి ఆఫ్-సైడ్ ఆడాలనే తొందరలో క్లీన్ బౌల్డ‌య్యాడు. శాంసన్ తరచుగా లెగ్-స్టంప్ బ‌య‌ట‌కు క‌దులుతూ షాట్లు ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. దీంతో మూడు స్టంప్‌లు బౌల‌ర్‌కు క్లియ‌ర్‌గా క‌నిపిస్తున్నాయి. బౌల‌ర్ స్టంప్స్‌ను టార్గెట్ చేయ‌డంతో అత‌డు క్లీప్ బౌల్డ్ అవ్వాల్సి వ‌చ్చింది" అని కామెంట‌రీ బాక్స్‌లో ఉన్న గ‌వాస్క‌ర్ పేర్కొన్నాడు. 

కాగా ఈ సిరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు మ్యాచ్‌లు ఆడిన సంజూ కేవలం 40 పరుగులు చేశాడు. దీంతో వరల్డ్‌కప్ తుది జట్టులో సంజూ స్ధానంపై సందిగ్థత నెలకొంది. ఎందుకంటే ప్రత్యామ్నయ ఓపెనర్‌గా జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తన రీ ఎంట్రీలో ఇరగదీస్తున్నాడు. సంజూ స్ధానంలో ఓపెనర్‌గా ఇషాన్‌కు చోటు ఇవ్వాలని చాలా మంది సూచిస్తున్నారు.
చదవండి: తుది నిర్ణయం వారిదే: గంభీర్ ‘తొలగింపు’పై బీసీసీఐ స్పందన
 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)