Breaking News

రోహిత్‌ శర్మ భారీ ఇన్నింగ్స్‌ ఆడితే...

Published on Sat, 03/08/2025 - 04:22

న్యూఢిల్లీ: భారత కెప్టెన్ , స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఫైనల్లో భారీ ఇన్నింగ్స్‌ ఆడితే అది మ్యాచ్‌నే ప్రభావితం చేస్తుందని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ విశ్లేషించారు. ‘హిట్‌మ్యాన్‌’ 25, 30 పరుగులకే పరిమితం కాకుండా ఎక్కువసేపు క్రీజులో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ టోర్నీలో రోహిత్‌ మెరుపు ఆరంభాల కోసం ప్రతిసారి ఎదురుదాడికి దిగుతున్నాడు. కానీ ఇదే క్రమంలో వెంటనే అవుటవుతున్నాడు. 

చాంపియన్స్‌ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై చేసిన 41 పరుగులే రోహిత్‌ అత్యధిక స్కోరుగా ఉంది. దీనిపై గావస్కర్‌ మాట్లాడుతూ ‘ఒకవేళ రోహిత్‌ 25 ఓవర్లపాటు బ్యాటింగ్‌ చేస్తే భారత్‌ 180 నుంచి 200 పరుగులు సాధిస్తుంది. అప్పుడు రెండు, మూడు వికెట్లు పడినా ఇన్నింగ్స్‌కు ఏ ఇబ్బంది ఉండదు. అక్కడి నుంచి సులువుగా 350 పరుగుల మార్క్‌ను దాటేస్తుంది. ఈ విషయాన్ని భారత కెపె్టన్‌ గుర్తుంచుకోవాలి. 

ఓపెనింగ్‌ మెరుపులు మెరిపించి వెళ్లడం కంటే కూడా కాస్త దూకుడుగా ఆడుతూ కనీసం 25–30 ఓవర్ల పాటు క్రీజును అట్టిపెట్టుకుంటే మ్యాచ్‌ రూపురేఖలే మారుతాయ్‌. రోహిత్‌ ఆట ఇన్నింగ్స్‌పై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో ఫైనల్‌ మ్యాచ్‌ను  ప్రత్యర్థి చేతుల్లోంచి లాగేసుకోవచ్చు’ అని అన్నారు. భారత కెప్టెన్‌ పాక్‌పై 20, న్యూజిలాండ్‌పై 15, ఆ్రస్టేలియాపై 28 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అర్ధసెంచరీ కూడా బాదలేకపోయాడు.  

న్యూజిలాండ్‌కు నాసిర్‌ హుస్సేన్‌ మద్దతు 
చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ అజేయమైన జట్టే అయినప్పటికీ ఫైనల్లో ట్రోఫీ గెలిచే అర్హత న్యూజిలాండ్‌కే ఉందని ఇంగ్లండ్‌ మాజీ కెపె్టన్‌ నాసిర్‌ హుస్సేన్‌ అన్నాడు. ‘కివీ క్రికెటర్లు చోకర్లు కాదు. ఒత్తిడిలోనూ నిలబడే స్థైర్యం వారికుంది. ప్రపంచశ్రేణి ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో ఉన్నారు. అమీతుమీలో వారంతా శక్తికిమించే పోరాడతారు’ అని వివరించాడు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)