బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

Published on Tue, 06/23/2026 - 09:12

భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించే అంశమై బీసీసీఐకి కీలక విజ్ఞప్తి చేశారు. వరుస సిరీస్‌లతో బిజీగా ఉండే భారత క్రికెటర్లకు ప్రతీ ఏడాది ఒక నెలపాటు విశ్రాంతి ఇస్తే బాగుంటుందని తెలిపారు.  గతంలో ఎన్నడూ లేనంతంగా గత రెండేళ్లుగా టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీగా మారిపోయింది. 

ఈ ఏడాది జనవరి నుంచి చూసుకుంటే టీ20 ప్రపంచకప్‌, ఆపై ఐపీఎల్ రెండు నెలల పాటు సాగింది. ఆ తర్వాత ఆరు రోజుల గ్యాప్‌తో భారత్‌, అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరిగింది. ఇలా వరుస సిరీస్‌లతో ఆటగాళ్లు అలసిపోవడమే గాక, గాయాల బారిన పడుతున్నారని సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. 

ఆఫ్గన్‌, ఐర్లాండ్ వంటి చిన్న దేశాల్లో క్రికెట్‌ను ప్రోత్సహించి, వారి ఆర్థిక ఎదుగుదలకు సహాయపడడంలో బీసీసీఐ మంచి పనే చేస్తోందన్నారు. కానీ ఇదే సమయంలో మన క్రికెటర్ల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి సారించాలని, ఏడాదిలో మన ఆటగాళ్లకు ఒక నెల విశ్రాంతి ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 

ఎందుకంటే భారత్‌లో క్రికెటర్లకు కొదువ లేదని, ప్రతిభావంతులు పుష్కలంగా ఉన్నారని, కాబట్టి వీలైనంతమేర సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పిస్తూ ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ రొటేట్ చేయాలని తెలిపారు. అఫ్గానిస్తాన్‌తో టెస్టులో గిల్‌, రాహుల్ శతకాలు సాధించారని, బుమ్రాకు విశ్రాంతినిచ్చి మానవ్ సుతార్‌కు అవకాశమిచ్చి మంచి పని చేశారని కొనియాడారు. 

ఇలా చేయడం వల్ల జట్టులో కీలక ప్లేయర్‌కు తగినంత విశ్రాంతి దొరికి మేజర్ సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇక అభిమానుల గురించి కూడా బీసీసీఐ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అండర్‌-19 మ్యాచ్‌లు ఎక్కువగా నిర్వహిస్తే యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని, దీనివల్ల టీమిండియాకు అదనపు జట్లు తయారయ్యేందుకు ఇది మరింత దోహద పడుతుందని తెలిపారు.

ఇక ఆఫ్గన్‌తో వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత​ జట్టు తర్వాత ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత జూలై 1 నుంచి ఇంగ్లండ్ పర్యటనలో బిజీ కానుంది. ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

చదవండి: హాలండ్‌ జోరు.. ఉత్కంఠ పోరులో నార్వే విజ‌యం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)