Breaking News

ఐర్లాండ్‌పై అద్బుత ప్రదర్శన.. హార్దిక్‌పై గవాస్కర్ ప్రశంసలు

Published on Thu, 06/06/2024 - 20:08

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన ఫామ్‌ను తిరిగి పొందాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ సారథిగా దారుణ ప్రదర్శన కనబరిచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్.. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌-2024లో సత్తాచాటుతున్నాడు. 

ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం న్యూయర్క్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా అదరగొట్టాడు. బ్యాటింగ్‌ చేసే అవకాశం రానప్పటకి బౌలింగ్‌లో మాత్రం హార్దిక్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

 ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యాపై భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పాండ్యా అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చాడని గవాస్కర్ కొనియాడాడు.

"హార్దిక్‌ పాండ్యా తిరిగి తన రిథమ్‌ను పొందడం చాలా సంతోషంగా ఉంది. హార్దిక్‌ తన బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు.  హార్దిక్‌ గతంలో రెండు ఓవర్లు వేసి బ్రేక్‌ తీసుకునే వాడు.

కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం వరుసగా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి ఔరా అనిపించుకున్నాడు. హార్దిక్‌కు ఐపీఎల్‌ తర్వాత వరల్డ్‌కప్‌ అనేది ఒక పరీక్ష వంటి. నా వరకు అయితే ఈ పరీక్షలో హార్దిక్‌ పాసైడని నేను భావిస్తున్నాని స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)