Breaking News

సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌.. ఎప్పుడూ ఇలాగే..: ఇర్ఫాన్‌ పఠాన్‌కు చురకలు

Published on Sat, 09/06/2025 - 11:52

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) గురించి ఇటీవలి కాలంలో విమర్శలు ఎక్కువయ్యాయి. అతడు తనకు ఇష్టమైన వాళ్లనే జట్టులోకి తీసుకుంటాడనే ఆరోపణలు మరోసారి తెరమీదకు వచ్చాయి. భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ (Irfan Pathan) ధోనిని ఉద్దేశించి ‘ఫేవటెరిజం’ కామెంట్లు చేయడం ఇందుకు కారణం.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ కూడా మరోసారి ధోనిపై విమర్శలు ఎక్కుపెట్టాడు. ధోని వల్లే తన కుమారుడి కెరీర్‌ అర్ధంతరంగా ముగిసిపోయిందని.. గౌతం గంభీర్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌ తదితరులు కూడా అతడి బాధితులేనని ఆరోపించాడు.

అది పక్షపాతం కాదు..
ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా మాత్రం ధోనికి మద్దతుగా నిలిచాడు. విజయవంతమైన కెప్టెన్లపై ఇలాంటి విమర్శలు సహజమేనని పేర్కొన్నాడు. ‘‘కెప్టెన్‌ ఎల్లప్పుడూ అత్యుత్తమ జట్టునే ఎంపిక చేసుకోవాలని భావిస్తాడు.

ఆ సమయంలో ఫామ్‌లో ఉండి.. ఒత్తిడిలోనూ రాణించగల ఆటగాళ్లకు వైపు మొగ్గుచూపుతాడు. కెప్టెన్‌ అయినా.. కోచ్‌ అయినా ఇదే పనిచేస్తారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ.  దీనిని పక్షపాతం, ఫేవటెరిజం అని అనకూడదు. వాళ్ల ప్రదర్శన ఆధారంగానే సదరు ప్లేయర్లు కెప్టెన్‌తో ఎక్కువకాలం కొనసాగారు అని అర్థం.

సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌.. ఎప్పుడూ ఇలాగే ఆలోచిస్తాడు
జట్టులో మొత్తం ఎంత మంది ప్లేయర్లు ఉన్నారు. వారిలో ఎంతమంది బెంచ్‌ మీద ఉన్నారన్న విషయం మీద మాత్రమే కెప్టెన్‌, కోచ్‌ దృష్టిసారించరు. ఒక విజయవంతమైన కెప్టెన్‌పై ఇలాంటివి అస్సలు ప్రభావం చూపించవు. తన జట్టులో సమర్థవంతమైన ఆటగాళ్లు ఉన్నారా? లేరా? ఇది గెలిచే జట్టేనా? అని మాత్రమే సారథి ఆలోచిస్తాడు.

నిజానికి అందరికంటే కెప్టెన్‌పై ఒత్తిడి, బాధ్యతా ఎక్కువగా ఉంటాయి. అతడిపై అంచనాలు కూడా అదేస్థాయిలో ఉంటాయి. అంతేగానీ.. కెప్టెన్‌కు నచ్చకపోవడం వల్ల.. అతడితో ఎక్కువ సమయం గడపకపోవడం వల్ల జట్టు నుంచి తప్పించడం వంటివి జరగవు’’ అని ఆకాశ్‌ చోప్రా స్పష్టం చేశాడు. అలా సుతిమెత్తగానే ఇర్ఫాన్‌ పఠాన్‌కు చురకలు అంటించాడు.

ఇప్పుడు ఇద్దరం కలిసే..
కాగా గతంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ మాట్లాడుతూ.. హుక్కా తాగుతూ, అతడికి కూడా అందిస్తూ ఉండేవాళ్లనే ప్రోత్సహిస్తాడంటూ ధోనిపై పరోక్షంగా విమర్శలు చేశాడు. ఇటీవల ఆ వ్యాఖ్యలు మరోసారి తెరమీదకు రాగా.. ఇప్పుడు ఇద్దరం కలిసే హుక్కా తాగుతున్నామని ఇర్ఫాన్‌ ఓ నెటిజన్‌ ప్రశ్నకు బదులిచ్చాడు. 

అయితే, ఇర్ఫాన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో యువీ తండ్రి మరోసారి ధోనిని టార్గెట్‌ చేయడం గమనార్హం. ఇక 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌, 2013 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన ధోని.. టీమిండియా తరఫున అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.

చదవండి: చిన్ననాటి గురువుకు రూ. 80 లక్షల సాయం.. హార్దిక్‌, కృనాల్‌ మంచి మనసు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)