Breaking News

'ఓవల్‌లో ఆడుతున్నా ఆ భయం వెంటాడుతోంది'

Published on Thu, 06/01/2023 - 08:26

జూన్‌ ఏడు నుంచి ఓవల్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనున్న సంగతి తెలిసిందే. 2019-21 డబ్ల్యూటీసీ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా ఈసారి ఎలాగైనా టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడుతున్న ఆస్ట్రేలియా కూడా అంతే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ఆస్ట్రేలియా వైస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్లో రచించనున్న ప్రణాళికలపై చర్చించాడు.'' ఓవల్‌లోని పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నా. వాస్తవానికి యూకేలోని బెస్ట్‌ బ్యాటింగ్‌ కండిషన్‌ పిచ్‌ అయిన ఓవల్‌ పేస్‌, బౌన్స్‌కు అనుకూలంగా ఉంటుందని అంటారు. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉండే అవకాశం ఉంది.

ఒకవేళ భారత్‌లో ఉండే పిచ్‌ కండీషన్‌లా ఉంటుందేమోనని చిన్నపాటి భయం కూడా ఉంది. నాకు తెలిసి టీమిండియా రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా రూపంలో ఇద్దరు ఫ్రంట్‌లైన్‌ స్పిన్నర్లను ఆడించే అవకాశం ఉంది. వారిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఒక అంచనాకు వచ్చాం. డబ్యూటీసీ(వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌) అనేది మంచి ఆలోచన. ఎంత సంప్రదాయ క్రికెట్‌ అయినా ఒక పోటీ ఉంటేనే మజా ఉంటుంది.

డబ్ల్యూటీసీ టైటిల్‌ అందుకోవాలన్న కాంక్షతో ప్రతీ జట్టు తమ శాయాశక్తులా మ్యాచ్‌లను గెలవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అటు టీమిండియా.. ఇటు మేము డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యాం. ఇక వచ్చే వారంలోపు టెస్టు ఛాంపియన్‌ ఎవరనేది తేలనుంది. ఇక మ్యాచ్‌కు వచ్చే అభిమానుల్లో ఆస్ట్రేలియన్ల కంటే టీమిండియా అభిమానులే ఎక్కువగా ఉంటారని అనుకుంటున్నా. మ్యాచ్‌ మాత్రం చాలా గొప్పగా ఉంటుందని అనుకుంటున్నా'' అంటూ తెలిపాడు. 

ఈ ఏడాది భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా 1-2 తేడాతో టెస్టు సిరీస్‌ను టీమిండియాకు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే మూడు వన్డేల సిరీస్‌ను మాత్రం 2-1తో చేజెక్కించుకుంది. ఇక ఐపీఎల్‌లో పాల్గొనని స్టీవ్‌ స్మిత్‌ ఇటీవలే ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడాడు. కౌంటీల్లో ఆడడం ద్వారా మంచి ప్రాక్టీస్‌ దొరికిందని.. డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు యాషెస్‌ సిరీస్‌కు కూడా సన్నద్దమైనట్లు ఇటీవలే స్మిత్‌ ట్విటర్‌లో తెలిపాడు.

చదవండి: త్రిపుర క్రికెట్‌లో ప్రొటీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌కు కీలక పదవి 

Videos

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు