Breaking News

'నీకు పదేళ్లు ఇస్తా.. సగం అయినా పట్టగలవేమో చూస్తా'

Published on Sat, 02/04/2023 - 13:30

శుబ్‌మన్‌ గిల్‌.. ప్రస్తుతం టీమిండియాలో ఒక సంచలనం. వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న గిల్‌ మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టి20లో సుడిగాలి శతకంతో అలరించిన గిల్‌ తాను టి20ల్లో కూడా ఎంత ప్రమాదకారి అనేది చెప్పకనే చెప్పాడు. అతని ప్రదర్శనపై టీమిండియా దిగ్గజాలు సహా కోహ్లి, రోహిత్‌ లాంటి స్టార్‌ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. 

అయితే రెండేళ్ల కిందట ఇంగ్లండ్‌ భారత్‌ పర్యటనకు వచ్చిన సమయంలో కోహ్లి, గిల్‌ల మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌. శ్రీధర్‌ తన ఆటోబయోగ్రఫీ ''కోచింగ్ బియాండ్- మై డేస్ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్''లో రాసుకొచ్చాడు. ''మార్చి 2021లో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. నాలుగో టెస్టు కోసం అహ్మదాబాద్‌లో ఉన్నాం.నరేంద్ర మోదీ స్టేడియంలో అదే మొదటి మ్యాచ్. అదీ కాకుండా భారత్‌లో జరిగే రెండో డే నైట్ టెస్టు. అప్పటికీ మనకు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తు ఖరారు కాలేదు.

ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకి చాలా అవసరం. పింక్ టెస్టు కావడంతో స్టేడియంలో సీట్లకు పింక్ కలర్ వేశారు. కరోనా నిబంధనల కారణంగా చాలా తక్కువ మందికి మ్యాచ్ చూసేందుకు అవకాశం కల్పించారు. ఒక చైర్‌కు పింక్ కలర్ వేసి మరో చైర్‌‌ను నార్మల్‌గా వదిలేశారు.ఈ విషయంపై చాలా పెద్ద చర్చే నడిచింది. పింక్ బాల్ టెస్టులో ఫీల్డింగ్ చేయడం చాలా కష్టం. ఫ్లడ్ లైట్స్ వెలుతురులో బంతి ఏ దిశలో వస్తుందో పసికట్టడం చాలా కష్టం. అందుకే ఫీల్డింగ్ సెషన్ సమయంలో విరాట్ కోహ్లీ, నాతో కలిసి క్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

ఆ సెషన్‌లో దాదాపు 200 క్యాచులను అందుకున్నాడు కోహ్లి. రేపు టెస్టు అనగా ప్రాక్టీస్ సెషన్స్‌లో అంత కష్టపడడం రిస్క్ అని నేను చెప్పినా వినలేదు. విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్నంతసేపు శుబ్‌మన్ గిల్ కొద్ది దూరంలో నిలబడి గమనిస్తూ ఉన్నాడు. కొంతసేపటి తర్వాత అతను కూడా వచ్చి క్యాచ్ ప్రాక్టీస్‌లో పాల్గొనాలనుకున్నాడు.

గిల్ అక్కడికి రాగానే విరాట్ కోహ్లీ నవ్వుతూ అతని వైపు చూసి.. ''నీకు పదేళ్లు ఇస్తా.. తమ్ముడు! ఇందులో సగం క్యాచులైనా నువ్వు పట్టుకో చూద్దాం'' అంటూ నవ్వాడు. విరాట్ కోహ్లీ అందుకున్న క్యాచులు అలాంటివి. అప్పటికి సెషన్స్ సమయం ముగియడంతో అందరం కలిసి టీమ్ బస్సులో బయలుదేరి పది నిమిషాల్లో హోటల్‌కి చేరిపోయాం'' అంటూ రాసుకొచ్చాడు.

చదవండి: తల్లికి రోడ్డు ప్రమాదం.. డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం ఎమోషనల్‌

అంత భయమేలా.. అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్‌

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)