Breaking News

టీమిండియా భారీ టార్గెట్‌.. వీరోచితంగా పోరాడిన సౌతాఫ్రికా

Published on Wed, 05/07/2025 - 18:31

శ్రీలంకలో జరుగుతున్న మహిళల ట్రై నేషన్‌ సిరీస్‌లో ఇవాళ (మే 7) భారత్‌, సౌతాఫ్రికా జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. జెమీమా రోడ్రిగెజ్‌ (123) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో జెమీమాతో పాటు స్మృతి మంధన (51), దీప్తి శర్మ (93) కూడా సత్తా చాటారు. దీప్తి 7 పరుగులతో సెంచరీని కోల్పోయింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా చివరి వరకు వీరోచితంగా పోరాడినప్పటికీ గెలవలేకపోయింది. అన్నెరీ డెర్క్‌సన్‌ (81), కెప్టెన్‌ క్లో ట్రయాన్‌ (67) సౌతాఫ్రికాను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేయగలిగింది. భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆటగాళ్లు పోరాడిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. 

భారత బౌలర్లలో అమన్‌జోత్‌ కౌర్‌ 3, దీప్తి శర్మ 2, శ్రీ చరణి, ప్రతిక రావల్‌ తలో వికెట్‌ తీశారు. ఫైనల్‌ రేసులో నిలవాలంటే సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉండింది. ఈ ఓటమితో సౌతాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్‌, శ్రీలంక ఫైనల్‌కు చేరుకున్నాయి. మే 11న కొలొంబో వేదికగా ఫైనల్‌ జరుగుతుంది. అంతకుముందు సౌతాఫ్రికా మే 9న శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్‌ ఆడనుంది.

ఈ టోర్నీలో సౌతాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. భారత్‌ నాలుగింట మూడు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక ​మూడింట రెండు గెలిచి రెండో స్థానంలో ఉంది. 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)