Breaking News

శ్రీలంక‌కు జింబాబ్వే షాక్‌.. 80 ప‌రుగుల‌కే ఆలౌట్‌

Published on Sat, 09/06/2025 - 19:03

హరారే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న రెండో టీ20లో జింబాబ్వే బౌల‌ర్లు నిప్పులు చేరిగారు.  ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక‌.. జింబాబ్వే బౌలర్ల దాటికి 17.4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 80 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆరంభం నుంచే శ్రీలంక బ్యాటర్లకు కష్టాలు ఎదురయ్యాయి. 

శ్రీలంక ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో తన వేసిన తొలి బంతికే ముజారబానీ.. స్టార్ బ్యాటర్ కుశాల్ మెండిస్‌(1) ఔట్ చేసి పర్యాటక జట్టుకు షాకిచ్చాడు. ఆ తర్వాత శ్రీలంక వికెట్లు పతనం కొనసాగింది. టాపర్డర్‌, మిడిలార్డర్, లోయార్డర్‌ అన్న తేడా లేకుండా లంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 

శ్రీలంక బ్యాటర్లలో కమిల్ మిశ్రా 20 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం ఏడు మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఈవెన్స్‌, కెప్టెన్ సికిందర్ రజా తలా మూడు వికెట్లు పడగొట్టి లంకేయుల పతనాన్ని శాసించారు.

వీరిద్దరితో పాటు ముజారబానీ రెండు, విలియమ్స్ ఒక్క వికెట్ సాధించారు. కాగా టీ20ల్లో శ్రీలంకకు ఇది రెండో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. ఇంతకుముందు టీ20 వరల్డ్‌కప్‌-2024లో సౌతాఫ్రికాపై శ్రీలంక కేవలం 77 పరుగులకే ఆలౌటైంది.

అదేవిధంగా జింబాబ్వే గడ్డపై టీ20ల్లో అత్యల్ప టోటల్‌ను నమోదు చేసిన మూడో జట్టుగా లంక చెత్త రికార్డును మూట కట్టకుంది. ఈ జాబితాలో జింబాబ్వే అగ్రస్ధానంలో ఉంది. 2024లో బులవాయో​ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 57 పరుగులకే ఆలౌటైంది.
చదవండి: Anshul Kamboj: మ‌రో జ‌హీర్ అన్నారు.. క‌ట్ చేస్తే! ఒక మ్యాచ్‌కే ఖేల్ ఖ‌తం

Videos

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)