Breaking News

ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌.. విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన శ్రీలంక ప్లేయర్‌

Published on Tue, 10/03/2023 - 16:24

వరల్డ్‌కప్‌ వార్మప్‌ గేమ్స్‌ కూడా ప్రేక్షకులకు కావాల్సినంత మజాను అందిస్తున్నాయి. తొలి వార్మప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఖంగుతిన్న శ్రీలంక.. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్‌ 3) జరుగుతున్న రెండో వార్మప్‌ మ్యాచ్‌లో ఇరగదీస్తుంది. ఈ మ్యాచ్‌లో లంక తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు మోస్తున్న కుశాల్‌ మెండిస్‌ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 59 బంతుల్లో  15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు.

సెంచరీ అనంతరం కూడా కుశాల్‌ మెండిస్‌ ఏమాత్రం తగ్గకుండా చెలరేగిపోతుండటంతో శ్రీలంక భారీ స్కోర్‌ దిశగా దూసుకుపోతుంది. 25 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 197/2గా ఉంది. పథుమ్‌ నిస్సంక (30), దిముత్‌ కరుణరత్నే (8) ఔట్‌ కాగా.. కుశాల్‌ మెండిస్‌ (76 బంతుల్లో 135; 18 ఫోర్లు, 7 సిక్సర్లు), సదీర సమరవిక్రమ (23 బంతుల్లో 12; ఫోర్‌) క్రీజ్‌లో ఉన్నారు. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ టాస్‌ గెలిచి శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 

కాగా, ఇవాళ ఈ మ్యాచ్‌తో పాటు మరో రెండు వార్మప్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో పాకిస్తాన్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ జరుగుతుండగా.. తిరువనంతపురంలో జరగాల్సిన భారత్‌-నెదార్లండ్స్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా ఆలస్యమవుతూ వస్తుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ 31 ఓవర్లలో 5 వికెట్ల నష్టాని​కి 184 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.

డేవిడ్‌ వార్నర్‌ (48), లబూషేన్‌ (40), మిచెల్‌ మార్ష్‌ (31), స్టీవ్‌ స్మిత్‌ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. అలెక్స్‌ క్యారీ (11) నిరాశపరిచాడు. మ్యాక్స్‌వెల్‌ (20), గ్రీన్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. పాక్‌ బౌలర్లలో ఉసామా మిర్‌ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్‌ రౌఫ్‌, మొహమ్మద్‌ నవాజ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)