నిసాంక సూపర్‌ సెంచరీ.. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన శ్రీలంక

Published on Mon, 09/09/2024 - 17:37

కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌ వేదికగా టెస్ట్‌ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌కు పర్యాటక శ్రీలంక ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో ముగించింది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలిచింది.

నిసాంక సూపర్‌ సెంచరీ
219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. పథుమ్‌ నిసాంక సూపర్‌ సెంచరీతో (127 నాటౌట్‌; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. నిసాంక.. ఏంజెలో మాథ్యూస్‌తో (32 నాటౌట్‌; 3 ఫోర్లు) కలిసి శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు. లంక ఇన్నింగ్స్‌లో దిముల్‌ కరుణరత్నే (8), కుసాల్‌ మెండిస్‌ (39) ఔటయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌, అట్కిన్సన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

పోప్‌ భారీ శతకం
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఓలీ పోప్‌ భారీ శతకంతో (154) కదంతొక్కాడు. బెన్‌ డకెట్‌ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. నిసాంక (64), ధనంజయ డిసిల్వ (69),కమిందు మెండిస్‌ (64) అర్ద సెంచరీలతో రాణించారు.

ఆతర్వాత లంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. లహీరు కుమార 4, విశ్వ ఫెర్నాండో 3, అశిత ఫెర్నాండో 2, మిలన్‌ రత్నాయకే ఓ వికెట్‌ పడగొట్టారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ జేమీ స్మిత్‌ (67) ఒక్కడే అర్ద సెంచరీ చేశాడు. 219 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)