Breaking News

నిప్పులు చెరిగిన పతిరణ.. ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన శ్రీలంక

Published on Sun, 02/18/2024 - 08:34

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా డంబుల్లా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. ఆఫ్ఘన్‌ బౌలర్లు ఫజల్‌ హక్‌ ఫారూకీ (4-0-25-3), నవీన్‌ ఉల్‌ హక్‌ (3-0-25-2), అజ్మతుల్లా (4-0-30-2) నూర్‌ అహ్మద్‌ (2-0-18-1), కరీం జనత్‌ (2-0-23-1) ధాటి​కి 19 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది.

లంక ఇన్నింగ్స్‌లో హసరంగ (32 బంతుల్లో 67; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. సమరవిక్రమ​ (25), ధనంజయ డిసిల్వ (24), కుశాల్‌ మెండిస్‌ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. నిస్సంక (6), అసలంక (3), షనక (6), మాథ్యూస్‌ (6), తీక్షణ (2), ఫెర్నాండో (0) విఫలమయ్యారు. 

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ చివరి వరకు పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెప్టెన్‌ ఇబ్రహీం జద్రాన్‌ (67 నాటౌట్‌) చివరివరకు క్రీజ్‌లో ఉన్నప్పటికీ గెలిపించలేకపోయాడు. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో జద్రాన్‌తో పాటు రహ్మానుల్లా గుర్బాజ్‌ (13), గుల్బదిన్‌ నైబ్‌ (16), కరీం జనత్‌ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (2), మొహమ్మద్‌ నబీ (9), నజీబుల్లా జద్రాన్‌ (0), కైస్‌ అహ్మద్‌ (7), నూర్‌ అహ్మద్‌ (9), నవీన్‌ ఉల్‌ హక్‌ (1) విఫలమయ్యారు. లంక బౌలర్లలో మతీశ పతిరణ (4-0-24-4) నిప్పులు చెరిగే బంతులు సంధించడంతో పాటు వికెట్లు తీసి ఆ‍ఫ్ఘన్ల పతనాన్ని శాశించాడు. దసున్‌ షనక (2/17), హసరంగ (1/20), తీక్షణ (1/31), మాథ్యూస్‌ (1/16) కూడా వికెట్లు తీశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)